RBI: దేశంలో రూ.2 వేల నోట్ల రద్దుతో జరగబోయేది ఇదేనా?

RBI: భారతీయ రిజర్వ్ బ్యాంకు శుక్రవారం సాయంకాలం తీసుకున్న నిర్ణయం పెను సంచలనంగా మారింది. 2 వేల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించటంలో బడాబాబుల గుండెల్లో రైళ్లు పరెగెడుతున్నాయి. సామాన్యులకు వద్ద ఎలాగా చాలా కాలం నుంచి ఈ నోట్లు అందుబాటులో లేవు. కేవలం కొందరి దగ్గరే రూంలకు రూములు ఈ నోట్లు మూలుగుతున్నాయని వారి నుంచి కక్కించటానికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే వార్తలు వినిపిస్తున్నారు. మరీ ఆ బడాబాబులు ఏ పార్టీలో ఉన్నారో చూద్దాం.

ఈ మధ్య కాలంలో ఎంతపెద్ద లావాదేవీలు అయిన 5 వందల నోట్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్బీఐ చాలా కాలమే రెండు వేల నోట్లను ప్రింట్ చేయడం మానేసింది. బ్యాంకులు కూడా చాలా వరకూ వాటిని కస్టమర్లకు నగదు రూపంలో ఇవ్వడం తగ్గించేశాయి. ఈ ఉపసంహరణ అనేది ఇప్పుడే కాదు, చాలా కాలం నుంచి జరుగుతోందన్న ప్రచారం ఉంది. ఇప్పుడు అధికారికంగా తీసుకున్నారు.

 

అయితే ఇదే సమయంలో నగదు రూపంలో బ్లాక్ మనీ దాచుకున్న వారికి ఈ నిర్ణయం షాక్ ఇవ్వడం ఖాయమేనతని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రియల్ ఎస్టేట్, రాజకీయ నేతలు, ప్రభుత్వాల్లో భారీగా లంచాలు వచ్చే పొజిషన్లలో ఉన్న వారి దగ్గర రెండు వేల నోట్లు పోగుపడి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒక్కో ఓటుకు ఒక నోటు పంపిణీ చేయడానికి అధికార పార్టీలు ప్రణాళికలు రెడీ చేసుకున్నాయన్న ప్రచారం కొంత కాలంగా సాగుతోంది.

 

ఈ నేపథ్యంలోనే అలాంటి బ్లాక్ మనీ పోగేసుకుని ఉన్న పార్టీలకు ఎదురుదెబ్బ తగిలినట్లేనని అంటున్నారు. అయితే ఇలాంటి సిట్యూటేషన్లను ఎలా డీల్ చేయాలో వారికి గత నోట్ల రద్దు సమయంలోనే క్లారిటీ వచ్చింది కాబట్టి.. కాస్త నష్టం జరిగినా చెలామణిలోకి తెచ్చుకుంటారని భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -