2000 notes: రూ.2 వేల నోట్లు డిపాజిట్ చేస్తున్నారా.. అక్కడ మాత్రం షాక్ తప్పదంటూ?

2000 notes: 2000 రూపాయల నోటు ఉపసంహరణకు మొదలైన తర్వాత ఇన్ని రోజులు భద్రంగా దాచుకున్న నోట్లన్నీ కూడా బయటపడుతున్నాయి. 2000 రూపాయలు రద్దు ప్రకటించే వరకు కూడా మార్కెట్లో 2000 రూపాయల నోట్లు చాలా తక్కువగా కనిపించాయి. అయితే ఎప్పుడైతే వీటిని రద్దు చేశామని ప్రకటించారో ఆ క్షణం పెద్ద ఎత్తున 2000 రూపాయల నోట్లు మార్కెట్లోకి వస్తున్నాయి. సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఈ నోట్లను మార్చుకోవాలని గడువు విధించారు.

రెండు వేల రూపాయల నోట్లు దాచుకున్న వారందరూ వాటిని మార్పు చేయడం కోసం పెద్ద ఎత్తున బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఇక హైదరాబాదులో అయితే 2000 రూపాయల నోట్లు విచ్చలవిడిగా బయటకు వస్తున్నాయి. వంద రూపాయలు షాపింగ్ చేయాలన్న రెండు వేల రూపాయల నోట్లు బయటకు తీసుకురావడం విశేషం. ఇలా 2000 రూపాయల నోట్ల ఉపసంహరణ వ్యాపారులకు చిల్లర కష్టాలను తీసుకొస్తుంది.

 

ఇలా పలు మార్కెట్లలోను షాపింగ్ మాల్స్ లో సరికొత్త నిబంధనలను విధించారు. మినిమం 1000 రూపాయలకు పైగా షాపింగ్ చేస్తేనే 2000 రూపాయల నోటుకు చిల్లర ఇవ్వబడుతుందని నిబంధనలు పెట్టారు. వెయ్యి రూపాయల పెట్రోల్ కొట్టించుకుంటేనే 2వేల రూపాయలకు చిల్లర ఇస్తామంటున్నాయి. మరోవైపు 2వేల నోటు చుట్టూ కొత్త ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.

 

2వేల రూపాయల నోట్లు ఇక్కడ తీసుకుంటాం అంటూ చాలా షాపుల్లో బోర్డులు కనిపిస్తున్నాయి. కొన్ని బ్యాంకుల క్యాష్ డిపాజిట్ మెషీన్లలో 2వేల రూపాయల నోట్లు తీసుకోవడం లేదు. ఇక ముత్తూట్ ఫైనాన్స్ కు చెందిన కొన్ని బ్రాంచీల్లో 2వేల రూపాయల నోట్లను తిరస్కరిస్తున్నారు. మరికొన్ని బ్యాంకులలో ఫారం నింపిన తర్వాతే 2000 రూపాయల నోట్లను తీసుకోవడం మరికొన్ని బ్యాంకులలో చిల్లర లేకపోవడంతో అకౌంట్లో డిపాజిట్ చేసుకోమని బ్యాంక్ అధికారులు ప్రజలకు సూచిస్తుండడం గమనార్హం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -