Venkatesh: విక్టరీ వెంకటేష్ గురించి ఈ షాకింగ్ నిజాలు మీకు తెలుసా?

Venkatesh: దర్శకుడు గీతాకృష్ణ చాలా మందికి తెలియదు. కొన్ని సినిమాలకు మాత్రమే డైరెక్టర్ గా చేసి, ఆతర్వాత దూరంగా ఉన్నారు. మెుదట తెలుగులో నాగార్జున హీరోగా, రమ్యకృష్ణ హీరోయిన్ గా సంకీర్తన అనే సినిమాతో గీతాకృష్ణ డైరెక్టర్ గా మారారు. కోకిల, కీచురాళ్ళు, ప్రియతమా, సర్వర్ సుందరం గారి అబ్బాయి, టైం, కాఫీ బార్ వంటి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు.

ఈ మధ్యకాలంలో గీతాకృష్ణ తెగ ఇంటర్య్వూలు ఇస్తున్నారు. యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన విక్టరీ వెంకటేష్ మీద, రానా మీద చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో విక్టరీ వెంకటేష్ రానా ప్రధాన పాత్రలలో రానా నాయుడు అనే ఒక వెబ్ సిరీస్ రూపొందింది. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ కంటెంట్ గా దీన్ని రూపొందించారు.ఈ సిరీస్ బాగా బోల్డ్ గా ఉందని విక్టరీ వెంకటేష్ మార్క్ సిరీస్ కాదని, ఆయన సినిమాలు చూసే ఫ్యామిలీస్ అందరూ ఈ సిరీస్ చూస్తే ఇబ్బంది పడడం తప్పదని పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి.

ఇదే విషయం మీద గీతాకృష్ణ స్పందించారు. ఆ బోల్డ్ వెబ్ సిరీస్ తీస్తే ఏమిటని ప్రశ్నించారు. నిజ జీవితంలో వెంకటేష్ గాని, రానా కానీ అంత పవిత్రులేమీ కాదు అన్నారు. మరోవైపు వాళ్లు తమకు నచ్చిన కథ వెబ్ సిరీస్ గా చేసే అవకాశం ఉంది అలాంటప్పుడు దాన్ని చూసేందుకు మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రానా అయితే చాలామంది అమ్మాయిలతో టైంపాస్ చేసేవాడని చెప్పకొచ్చారు.

రానా గురించి గతంలో సుచీ లీక్స్ లో కూడా కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి అనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎలాంటి మరకలు లేని విక్టరీ వెంకటేష్ మీద గీతా కృష్ణ చేసిన కామెంట్లతో ఆయన మీద వెంకటేష్ అభిమానులు, సినీ అభిమానులు విరుచుకుపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -