Pushpa2: పుష్ప 2 టీజర్ లో అల్లు అర్జున్ గమనించారా.. కథ మొత్తం ఇక్కడే ఉందా?

Pushpa2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్నటువంటి చిత్రం పుష్ప 2. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.పుష్ప సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు.

ఇక ఈ టీజర్ ఏకంగా మూడు నిమిషాల నిడివి ఉండడంతో ఇందులో అల్లు అర్జున్ పాత్ర ఎంత మేర ఉంటుందో ఈ టీజర్ ద్వారా సుకుమార్ తెలియజేశారు. ఈ టీజర్ ఎన్నో అనుమానాలను ఈ సినిమాపై సందేహాలను కూడా వ్యక్తం చేస్తుంది. ఈ టీజర్ విడుదల కావడమే కాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయడంతో అల్లు అర్జున్ ఇందులో అమ్మవారి గెటప్ గెటప్ లో కనిపించారు. ఇక ఈ టీజర్ కనుక చూస్తే అల్లు అర్జున్ పోలీసుల నుంచి తప్పించుకొని తిరిగే ఒక స్మగ్లర్ వలే చూపించారు.

పుష్ప కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నట్లు టీజర్ లో చూపించారు. నైట్ విజన్ కెమెరాలో పుష్ప విజువల్స్ మీడియాకి లభిస్తాయి. అక్కడ పుష్ప తన ట్రేడ్ మార్క్ స్టైల్ లో గడ్డం నిమురుకుంటుండగా చిటికెన వేలు మాత్రం నైల్ పాలిష్ చేసి ఉంటుంది ఇలా ఈ చిటికెన వేలుకు మాత్రమే నెయిల్ పాలిష్ ఉన్నట్టు కనిపించడంతో అల్లు అర్జున్ పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం ఇలా వేషాలు మారుస్తూ తిరుగుతూ ఉంటాడని ఈ క్రమంలోనే హిజ్రా రూపంలో కూడా ఈయన కనిపించబోతున్నారని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక ఈ టీజర్ లో పుష్ప చైనా జపాన్ మలేషియా అలాంటి దేశాలకు పారిపోయాడా అనే అనుమానాలను కూడా వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇక పుష్ప సినిమా మొదటి భాగంలో చైనా జపాన్ పేర్లను ప్రస్తావించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి ఆదేశాలకి తరలిస్తూ ఉంటారు అయితే పుష్ప 2 కథ చైనాకి సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా టైటిల్ లోగో కనుక చూస్తే అందులో మనకు గ్రీన్ కలర్ డ్రాగన్ తరహా లోగో కనబడుతుంది.డ్రాగన్ అంటే చైనా అని ఈ విధంగా సుకుమార్ చెప్పకనే ప్రేక్షకులకు హింట్ ఇచ్చారని తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ టీజర్ సినిమా పై భారీగా అంచనాలను పెంచాయని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -