Shani Dev: శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా?

Shani Dev: చాలామంది శని దేవుని పేరు వినగానే ఇప్పుడు నెగిటివ్ గానే ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా పనులు జరగకపోతే శని చుట్టుకుందని, శని మెల్ల మీద కూర్చున్నాడు అని ఇలా సందర్భానుసారాన్ని బట్టి శని దేవుడిని నిందిస్తూ శని దేవుడిని తిట్టుకుంటూ ఉంటారు. కానీ శని దేవుడు చేసే మంచి తెలిస్తే మాత్రం శనీశ్వరుడిని ఆరాధించకుండా అస్సలు ఉండలేరు. శని దేవుడు అనుగ్రహం ఒక్కసారి కలిగింది అంటే చాలు కోటీశ్వరులు అవడం ఖాయం. అలాగే శని ఎవరిపై అయిన ఆగ్రహించాడు అంటే వాళ్ళు ఎంత కోటీశ్వరులు అయిన కష్టాలు అనుభవించడం ఉన్న డబ్బు మొత్తం పోవడం కాయం.

చాలా మంది శని దేవుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ప్రతి శనివారం ఆలయాలలో శనిదేవుడిని పూజించేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. శని దేవుని అనుగ్రహం లభించింది అంటే చాలు వారి జీవితంలో సకల సౌకర్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే, శనివారం రోజు నల్ల దుస్తులు ధరించాలి. శని దేవుడిని పూజించేటప్పుడు నల్ల నువ్వులు, నల్ల శనగలు, ఇనుప వస్తువులు సమర్పించాలి. దాంతోపాటు శనివారాల్లో నల్లరంగు వస్తువులను నిరుపేదలకు అందజేయాలి.

 

వీటిలో నల్ల నువ్వులు, నల్ల శనగలు, ఆవాల నూనె కూడా శనివారం దానం చేయాలి. శని దేవుడిని ఆరాధించే సమయంలో పరిశుభ్రత పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి. లేదంటే శని దేవుడికి ఆగ్ర‌హానికి గురికావ‌ల్సి వస్తుంది. ఎవ‌రికైనా ఆరోగ్యం నిలకడగా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ స‌మ‌యంలో రోగులకు సహాయం చేయాలి. అలాగే శనివారం నాడు శని ఆలయానికి వెళ్లి పూజించాలి. అలాగే త‌మ‌ కీర్తి ప్రతిష్టలు వేగంగా పెరుగుతుంటే అది శనీశ్వరుడి అనుగ్రహం ఫలితం అని భావించాలి. అలాగే శనివారం షూస్, చెప్పులు దొంగిలించబడితే శుభ సంకేతంగా భావిస్తారు. దీంతో శని దేవుడు త‌మ‌పై సంతోషంగా ఉన్నారని అర్థం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -