Tarak Sons: చరణ్ కూతురుపై ప్రేమతో యంగ్ టైగర్ కొడుకులు అలా చేశారా?

Tarak Sons: మెగా ఇంట్లోకి మూడో తరం వారసురాలు అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు పెళ్లైన 11 సంవత్సరాలకు బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఉపాసన ఈ చిన్నారి యోగక్షేమాలు చూసుకుంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ విధంగా మెగా వారసురాలు క్లీన్ కారా ఫోటో ఇప్పటికి రివీల్ చేయకపోయినా ఈమెకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

ఇక తమ చిన్నారిని ఎప్పుడెప్పుడు అభిమానులకు పరిచయం చేస్తారా అని మెగా ఫాన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో రామ్ చరణ్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అదేవిధంగా ఈయనకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చాలా మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ వ్యక్తిగతంగా చాలా స్నేహంగా ఉంటారని పలు సందర్భాలలో తెలియచేశారు. ఇక రామ్ చరణ్ కి కుమార్తె పుట్టడంతో ఎన్టీఆర్ మొదటగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

 

ఇకపోతే రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా మారడంతో ఎన్టీఆర్ దంపతులు చిన్నారికి ప్రత్యేకమైన బహుమతి పంపించారట అయితే ఆ బహుమతి ఏంటి అనే విషయానికి వస్తే రామ్ చరణ్ ఉపాసనతో పాటు తమ చిన్నారి క్లీన్ కారా పేరుతో ఉన్నటువంటి ఒక గోల్డ్ డాలర్,అలాగే చిన్నారికి అవసరమైనటువంటి కొన్ని టాయ్స్ అన్నింటిని కూడా తనకు పంపించారని తెలుస్తోంది.

 

ఇలా ఎన్టీఆర్ దంపతులు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ కుమారులు కూడా క్లీన్ కారా కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ పంపించారట. మరి క్లీన్ కారా కోసం ఎన్టీఆర్ కుమారులు పంపిన ఆ గిఫ్ట్ ఏంటి అనే విషయానికి వస్తే… ఎన్టీఆర్ కుమారులు ఇద్దరు స్వయంగా గీసినటువంటి డ్రాయింగ్ క్లీన్ కార కోసం స్పెషల్ గా పంపించారని తెలుస్తుంది. ఇలా ఈ చిన్నారులు తన కూతురి కోసం స్పెషల్ గిఫ్ట్స్ పంపించడంతో మురిసిపోయిన ఉపాసన రాంచరణ్ తిరిగి వారికి రిప్లై ఇచ్చారనీ తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -