Anil Ravipudi: బోయపాటి పరువు తీసేలా థమన్ ను మెచ్చుకున్న అనిల్ రావిపూడి.. పరువు పోయిందిగా!

Anil Ravipudi: సినిమా హిట్ అయితే క్రెడిట్ తనదని ఫ్లాప్ అయితే కారణాలని వేరే వాళ్ళ మీదకి తోసేయటం సినిమా వాళ్ళకి అలవాటే. స్కంద విషయంలో అదే జరుగుతుంది. స్కంద సినిమా రిజల్ట్స్ తర్వాత సంగీత దర్శకుడు తమన్ మధ్య సఖ్యత లోపించిందని విషయం వారి ఇంటర్వ్యూల ద్వారా తెలిసింది. స్కంద నేపథ్య సంగీతం విషయంలో తనకి చాలామంది కంప్లైంట్స్ చేశారని బోయపాటి శ్రీను తెలిపారు.

తమన్ నేపథ్య సంగీతం లేకుండా చూసినా అఖండ శక్తివంతంగా ఉంటుందని, స్కంద విడుదలైన తరువాత తమన్ తో తాను మాట్లాడలేదని చెప్పారు. అయితే ఈ విషయంపై నేరుగా స్పందించలేదు తమన్, కానీ ఐ డోంట్ కేర్ అంటూ ట్వీట్ చేశారు. అయితే ఇది బోయపాటిని ఉద్దేశించి చేసిందే అని జనాలు భావించారు. బోయపాటి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సంగీత దర్శకుడికి ఎక్కువ మద్దతు లభించింది. అఖండ సినీ విజయంలో తమన్ నేపథ్య సంగీతం ఎంతవరకు తోడ్పడిందో అందరికీ తెలిసిందే.

అయితే దర్శకుడు అనిల్ రావిపూడి కూడా తన మద్దతుని తమన్ కే ప్రకటించారు. తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించిన సినిమాలో ఉన్నాయి. అదే సమయంలో అతడిని ట్రోల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరితో అయినా సరే కంటెంట్ మాత్రమే పని చేయించుకుంటుందని, దర్శకుడు కాదని ఆయన వివరించారు. సంగీత దర్శకులను పిండి పని చేయించుకునే వారి స్పేస్ లోకి తాను వెళ్లదలచుకోలేదని అనిల్ రావిపూడి సమయస్పూర్తిగా మాట్లాడారు. ఎందుకంటే ఒకసారి బోయపాటి శ్రీను సంగీత దర్శకులను పిండి పని చేయించుకుంటానని ఇంటర్వ్యూలో చెప్పారు. దాన్నే తెలివిగా అనిల్ రావిపూడి తిప్పి కొట్టారు.

ఏ సంగీత దర్శకుడు సినిమాని కావాలని చెడగొట్టడు. మనం అద్భుతంగా తీసిన సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్ళటం సంగీత దర్శకుడు బాధ్యత. హిట్, ప్లాపులకు ఎవరూ అతీతులు కారు. మాక్సిమమ్ బాగుండాలని ట్రై చేస్తాడు తమ అని అనిల్ రావిపూడి చెప్పారు. తమన్ బెస్ట్ వర్క్ భగవంత్ కేసరి సినిమాలో చూస్తారని ఆయన పేర్కొన్నారు. అతని వర్క్ పట్ల తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పుకొచ్చారు. దీంతో అనిల్ రావిపూడి బోయపాటి శ్రీను పరువు తీసేసినట్లుగా అయిపోయింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -