Bhagavanth Kesari 2: భగవంత్ కేసరి2 సినిమాలో బాలయ్య హీరో కాదా.. నందమూరి ఫ్యాన్స్ కు భారీ షాక్ అంటూ?

Bhagavanth Kesari 2: నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19వ తేదీ విడుదల అయింది. బాలకృష్ణ కెరియర్ లో ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుందనే సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించక శ్రీ లీల బాలయ్యకు కూతురి పాత్రలో నటించారు.

ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ప్రెస్ మీట్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే సక్సెస్ మీట్ కార్యక్రమాలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా భగవంత్ కేసరి 2 వార్తలు వచ్చాయి.

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క హిట్ సినిమాకు సీక్వెల్ చిత్రం వస్తున్న సంగతి మనకు తెలిసిందే .ఈ క్రమంలోనే భగవంత్ కేసరి సినిమాకి కూడా సీక్వెల్ చిత్రం ఉంటుందా అన్న ప్రశ్న అభిమానుల నుంచి అనిల్ రావిపుడి నుంచి ఎదురయింది. అయితే ఈ ప్రశ్నకు అనిల్ రావిపూడి సమాధానం చెబుతూ ఇప్పటికే తాను చాలా బరువు మోయలేకపోతున్నానని తెలిపారు కానీ బాలయ్య గారి సపోర్ట్ ఉంటే తప్పకుండా భగవంత్ కేసరి 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు.

అనిల్ రావిపూడి ఈ సినిమా సీక్వెల్ చిత్రం గురించి మాట్లాడటంతో అభిమానుల నుంచి ఒక విజ్ఞప్తి ఎదురైంది ఈ సినిమాలో హీరో తండ్రి పాత్రలో బాలయ్య నటించిన హీరోగా మాత్రం బాలకృష్ణ కాకుండా తన కుమారుడు మోక్షజ్ఞ తీసుకోవాలి అంటూ ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు మరి ఫ్యాన్స్ డిమాండును అనిల్ రావిపూడి పరిగణలోకి తీసుకొని బాలయ్య వారసుడిని తన సినిమాలో భాగం చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -