RGV-Kanthara: అవి చేయలేని పని కాంతార సినిమా చేస్తోంది.. వర్మ ట్వీట్ వైరల్!

RGV-Kanthara: కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలోనే నటించిన చిత్రం కాంతార. కే జి ఎఫ్ అద్భుతమైన సినిమాని నిర్మించిన హోం భలే ఫిలిం సమస్త ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమా కన్నడ భాషలో సెప్టెంబర్ 30వ తేదీ విడుదల ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా కేవలం కన్నడలో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా ఎంతో మంచి విజయాన్ని కైవసం చేసుకుంది. ఇక తెలుగులో ఈ చిత్రాన్ని అక్టోబర్ 15వ తేదీ విడుదల చేశారు.

తెలుగులో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలుగు సినిమా హక్కులను కొనుగోలు చేసే విడుదల చేశారు. అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో కూడా కాసుల వర్షం కురిపిస్తుంది.ఈ సినిమా విడుదలైన మూడు రోజులకే అల్లు అరవింద్ కు ఏకంగా నాలుగు కోట్ల వరకు లాభదాయకంగా మారిందని ట్రేడ్ వర్గాల నిపుణులు చెబుతున్నారు.ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టడంతో ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ సినిమాపై స్పందించి కామెంట్లు చేశారు.

ఇప్పటికే ప్రభాస్ అనుష్క వంటి తదితరులు ఈ సినిమాపై స్పందిస్తూ అద్భుతమైన సినిమా ఎవరు మిస్ కావద్దు అంటూ తెలియజేశారు. ఈ క్రమంలోనే కాంట్రవర్సీ కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రాంగోపాల్ వర్మ కూడా ఈ సినిమాపై స్పందిస్తూ తనదైన శైలిలో చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది. ఈ సందర్భంగా వర్మ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… కేవలం సూపర్ స్టార్స్, మాసివ్ ప్రొడక్షన్ వాల్యూస్, స్పెక్టాక్యులర్ వీఎఫ్‌ఎక్స్ మాత్రమే జనాలను థియేటర్లకు రప్పించగలరని భావిస్తున్నారు.అయితే ఈ విధంగా వీళ్లు భావిస్తున్న సమయంలో వీళ్లు కూడా థియేటర్లకు సినిమాలను రప్పించలేకపోతున్న తరుణంలో ఒక చిన్న సినిమా విడుదలవుతూ భారీగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నారు.

ఇప్పటికే ఎన్నో చిన్న సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకోగా,తాజాగా కాంతార సినిమా కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంది.ఇలా ఒక సినిమా పెద్ద సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తోంది అంటూ వర్మ ట్విట్టర్ పేదికగా కాంతార సినిమాపై స్పందిస్తూ ఈమె చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక ఈ సినిమా విడుదలైన మూడు రోజులకే భారీ కలెక్షన్లను రాబట్టి అల్లు అరవింద్ కు భారీ లాభాలను తీసుకువచ్చింది. ఈ సినిమా పూర్తి అయ్యే లోపు అల్లు అరవింద్ ఏకంగా 10 కోట్ల వరకు లాభాలు తీసుకుంటారని నిపుణులు వెల్లడిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -