Directors: దండలయ్యా తారక్.. నీలాంటి హీరోలు ఉండాల్సిందే!

Directors: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ ఒక స్టార్ హీరోగానే కాకుండా ఎందరో దర్శకులను విజయాలతో నిలబెట్టిన హీరోగా అవతరించారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ గుర్తింపును జూనియర్ ఎన్టీఆర్ అందుకున్నారు. మూడేళ్ల కాలం పాటు ఆర్ఆర్ఆర్ కోసం ఆయన పనిచేశారు. గోడు వీరుడిగా కొమరం భీమ్ పాత్రలో ఆయన కనిపించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ప్యాన్ ఇండియా లెవల్లో మంచి గుర్తింపు వచ్చింది.

రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని మొదలు పెట్టారు. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతోంది. ఈ మధ్యనే కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య సినిమా చేసి విమర్శల పాలయ్యాడు. అయినా కూడా కొరటాలతో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించారు.

దర్శకుడు కొరటాలకే కాదు చాలా మంది డైరెక్టర్లకు జూనియర్ ఎన్టీఆర్ ఒక ఆయుధంలా అయ్యాడనే చెప్పాలి. అందులోనూ ప్లాప్ సినిమాలతో ఉన్న దర్శకులకు ఎన్టీఆర్ ఇచ్చే భరోసా అంతా ఇంతా కాదు. ఇది వరకూ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కూడా పవన్ తో ‘అజ్ఞాతవాసి’ చేసి అపజయాన్ని మూటగట్టుకున్నాడు. ఆ సమయంలో త్రివిక్రమ్ పలువురి చేత విమర్శల పాలయ్యాడు. ఆ త తర్వాత ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా చేసి ఆయన విజయం సాధించారు.

అదేవిధంగా 2015లో ఎన్టీఆర్ పూరీ జగన్నాథ్‌ను నమ్మి ‘టెంపర్’ సినిమా చేయగా అదీ విజయం సాధించింది. మహేష్ బాబుతో వన్ ‘నేనొక్కడినే’ సినిమాతో విజయం సాధించని సుకుమార్ ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ తో సినిమా చేశాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. పవన్ కళ్యాణ్‌తో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ వంటి డిజాస్టర్ సినిమా చేసిన బాబీ కూడా ఆ తర్వాత ఎన్టీఆర్‌ తో ‘జై లవకుశ’ తీసి హిట్ టాక్ అందుకున్నారు. ఇలా మొత్తంగా ఎందరో టాలీవుడ్ దర్శకులకు ఎన్టీఆర్ ఆయుధంలా మారాడు.

Related Articles

ట్రేండింగ్

Election Commission: పింఛన్ల పంపిణీలో ఈసీ కీలక ఆదేశాలు.. జగన్ సర్కార్ కు ఇక చుక్కలేగా!

Election Commission: ఏపీలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది అయితే ప్రజలకు అందే సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే తీసుకువెళ్లారు అయితే...
- Advertisement -
- Advertisement -