Devotional: సంపద పెరిగి చేతిలో డబ్బులు నిలవాలంటే ఇలా చేయాల్సిందే?

Devotional: ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కొందరు ఎంత కష్టపడి సంపాదించినా కూడా చేతిలో మిగలడం లేదని బాధపడితే మరికొందరు సంపాదనలేదు అని బాధపడుతూ ఉంటారు. ఎక్కువ శాతం మంది ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలడం లేదు ఏం చేయాలి అంటూ తలలు పట్టుకుంటూ ఉంటారు. కొందరు సంపాదించిన సంపాదన సరిపోక అప్పులు చేసి తీర్చలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు.

 


అయితే ఇందుకు ప్రయత్న లోపం ఒకటైతే, కొన్నిసార్లు ఎంత కష్టపడి ప్రయత్నించినా ఫలితం దక్కకపోవడం మరింత బాధ. ఇలాంటి వారికోసం ఐశ్వర్య దీపం కొంత ఉపశమనాన్ని ఇస్తుందంటారు పండితులు. ఐశ్వర్య దీపం అంటే ఏమిటి? ఆ ఐశ్వర్య దీపాన్ని ఎలా పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పెద్ద ప్రమిదలు రెండు తీసుకుని పసుపు,కుంకుమ రాయాలి. బియ్యం పిండి పసుపు కుంకుమతో ముగ్గు వేసి దానిపై ప్రమిదలు ఒకదాని పైన ఒకటి ఒకటిగా పెట్టి అందులో ఒక పావు కిలో రాళ్ళ ఉప్పు వేసి, ఆ రాళ్ళ ఉప్పు పైన పసుపు కుంకుమ చల్లాలి.

 

ఒక చిన్న ప్రమిద దానిపై పెట్టి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి రెండు ఒత్తులు ఒక్కటిగా వేసి దీపం వెలిగించాలి. నైవేద్యంగా పళ్ళు, పాలు, పటికబెల్లం, కొబ్బరికాయ ఏదైనా నైవేద్యంగా పెట్టి, లక్ష్మీ దేవి, వేంకటేశ్వరస్వామి స్త్రోత్రం చదువుకోవాలి. కనకధార స్త్రోత్రం కూడా చదివితే మంచిది. అయితే దీపారాధన తర్వాత ఉప్పు ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. శుక్రవారం దీపారాధన చేసిన తర్వాత శనివారం రోజు ఆ ప్రమిదల్లో ఉన్న ఉప్పు తీసేసి నీటిలో కలపి ఆ నీటిని ఇంటి బయట ఎవ్వరూ తొక్కని స్థలంలో పోయాలి. అవకాశం ఉంటే చెరువుల్లో, నదుల్లో కలపవచ్చు. ఏ అవకాశం లేకుంటే నీళ్లలో కలిపి షింక్ లో అయినా పోయవచ్చు. వారం వారం ప్రమిదలు మార్చాల్సిన పనిలేకుండా అవే వినియోగించుకోవచ్చు. అయితే ప్రతి శుక్రవారం ఉప్పుపై దీపం వెలిగించిన తర్వాత శనివారం రోజు మాత్రం ఆ ఉప్పు తీసేయాలి. ఇలా 11 శుక్రవారాలు కానీ 16 వారాలు కానీ, 21, 41 వారాలు కానీ అనుకుని దీపం వెలిగించాలి. ఈశాన్యమూలన పెడితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. 41 శుక్రవారాలు ఇలా ఉప్పుతో దీపం పెట్టే వారికి శాశ్వతంగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -