Business: పెట్టుబడి లేకుండా లక్షల్లో సంపాదించాలంటే ఇలా చేయండి!

Business: నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూనే ఉంటారు. ప్రస్తుతం తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే తపనతో వివిధ పనులు చేస్తుంటారు. అయితే ఇలా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చాలా మంది రియస్‌ ఎస్టేట్‌ వ్యాపారంపై ఆసక్తి కనబరుస్తారు. భూమికి ఉన్నంత విలువ మరే ఇతర ఆస్తికి ఉండదు. ఈ సూత్రం తోనే రియల్‌ ఎస్టేట్‌ రంగంలో చాలామంది రాణిస్తున్నారు. అయితే రియల్‌ ఎస్టేట్‌ అంటేనే పెట్టుబడి పెట్టాలి. మరి పెట్టుబడి లేకుండా ఎలా సాధ్యమవుతుందని చాలా మంది వెనక్కి తగ్గుతుంటారు. కానీ అన్ని రంగాల తరహాలోనే రియల్‌ ఎస్టేట్‌ లోనూ డిమాండ్‌ ఉన్నప్పటికీ అమ్మకందారులు కొనుగోలుదారులు మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. రియల్‌ ఎస్టేట్‌ బ్రోకరేజ్‌ వ్యాపారం చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది. ఇళ్ల స్థలాలు, ఇల్లు, పొలాలు, తోటలు, అపార్ట్‌మెంట్లు ప్లాట్స్‌ ఇలా అన్ని రకాల ఆస్తుల క్రయవిక్రయాల చేపడుతూ ఆదాయాన్ని పొందవచ్చు.

వ్యాపారం ద్వారా రెండు వైపుల నుంచి కమీషన్‌ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాపారానికి ఒక కార్యాలయం తెరవాల్సి ఉంటుంది. అంతేకాదు ఆఫీసు ద్వారా అమ్మకందారులు, కొనుగోలుదారులను కలిసే వీలుంటుంది. అలాగే ఆన్‌లైన్‌ ద్వారా కూడా క్రయ విక్రయాలు జరపవచ్చు. ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు రియల్‌ ఎస్టేట్‌ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తారు. అలాంటి వారిని మీరు కాంటాక్ట్‌ చేసి వారికి మంచి ఆస్తులు కొనుగోలు చేసేలా మీరు సర్వీసు అందించవచ్చు. తద్వారా మీరు కమీషన్‌ రూపంలో ఆదాయం పొందే వీలుంది.

అంతేకాదు రియల్‌ ఎస్టేట్‌ రంగంలో రీసేల్‌ ఇళ్లకు మంచి డిమాండ్‌ ఉంటుంది. ముఖ్యంగా అమ్మకందారులు, తమకు కావాల్సిన రేటు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అలాగే కొనుగోలుదారులు కూడా వాస్తుతో పాటు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ఆస్తులను కొనుగోలు చేసేందుకు చూస్తుంటారు. ఈ వ్యాపారంలో రాణించాలి అనుకుంటే నిజాయితీగా ఉండటం చాలా అవసరం. అలాగే న్యాయ సలహాలు కూడా ఎప్పటికప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. అనైతిక పద్ధతులు లాభం కోసం వివాదాస్పద ఆస్తి గొడవల్లో తలదూర్చితే మాత్రం చిక్కుల్లో పడాల్సి ఉంటుంది. నిజాయితీగా ఉంటూ ఈ వ్యాపారంలో దిగితే ఆదాయం పొందవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -