Emerald Gemstone: వ్యాపారంలో దూసుకుపోవాలంటే ఈ రత్నం ధరించండి..!

Emerald Gemstone: చాలా మంది గ్రహాలు, రాశిఫలాలు ఎక్కువగా నమ్ముతారు. ఉంగారాలు, నవరత్నాలు ధరించడంతో లాభాలతో పాటు ఆరోగ్యంగా ఉంటారని అపార నమ్మకం. అయితే ‘ఎమరాల్డ్’ రత్నం ధరించడంతో చాలా లాభాలు ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఓ వ్యక్తి జీవితంలో జరిగే హెచ్చు తగ్గుల వెనుక అతని జాతకంతో ముడిపడి ఉంటుంది. 12 ఇళ్లలోని తొమ్మిది గ్రహాల కదలిక ఒక వ్యక్తికి సంపద, ప్రతిష్ట లభిస్తుంది లేదా ఆకాశం నుంచి కింద పడేలా చేస్తుంది. ఈ గ్రహాలను నియంత్రించడానికి జ్యోతిషశాస్త్రం, రత్నశాస్త్రంలో నివారణలు ఉన్నాయి. గ్రహాలు, రాశిచక్రం ప్రకారం రత్నాన్ని ధరించడంతో వ్యక్తి జీవితంలో సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఎమరాల్డ్ రత్నం ధరించడంతో వచ్చే లాభాలు ఏంటో తెలుసుకుందాం.

రత్న శాస్త్రం ప్రకారం పచ్చ రత్నం బుధ గ్రహాన్ని సూచిస్తుంది. దీన్ని ధరించడంతో వ్యక్తి జీవితంలో అనేక విజయాల సాధిస్తారంట. పచ్చ రత్నాన్ని ధరించడంతో కలిగే ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఈ రత్నం ధరించిన వ్యక్తిపై అద్భుతంగా పనిచేస్తుంది. పచ్చ రత్నం ధరించిన వ్యక్తి తెలివైనవారుగా అవుతారు. ఈ వ్యక్తులు తమ నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. అంతేకాక ఎమరాల్డ్ ధరించిన వ్యక్తికి ఊహా శక్తి పెరుగుతుంది. పచ్చ రత్నాన్ని ధరించిన వ్యక్తి వివిధ మార్గాల్లో ఆలోచించడం ద్వారా జీవితంలోని వివిధ సమస్యలకు పరిష్కారాలను కనుగొంటాడు.

పచ్చ రత్నాన్ని ధరించిన వ్యక్తి ఆర్థికంగా చాలా బలంగా ఉంటాడంట. ఎమరాల్డ్ వ్యాపారంలో డబ్బు, లాభాలను సృష్టిస్తుంది, షేర్ మార్కెట్, బ్యాంకింగ్, టెక్స్‌టైల్ మొదలైన వ్యాపారం లేదా ఉద్యోగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ రత్నాన్ని ధరించాలని సలహా ఇస్తుంటారు. పచ్చ రత్నాన్ని బుధ గ్రహ రత్నంగానూ, బుధుడిని వాక్కు, బుద్ధి గ్రహంగానూ పరిగణిస్తారు కాబట్టి పచ్చ రత్నాన్ని ధరించిన వ్యక్తి ప్రసంగాలు చేయడంలో మొదటి స్థానంలో ఉంటాడు. ఈ రత్నం మీ కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని అనేక రెట్లు పెంచుతుంది. కిడ్నీ, కడుపు, గుండె, మెదడు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందుతాడు. పచ్చ రత్నం చర్మానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందంంట. దీనిని రాయల్ రత్నం అని కూడా అంటారు. బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ తన ఆభరణాలలో ఈ రత్నాన్ని ధరించింది. దీనిని ధరించిన వ్యక్తి తన జీవితంలో పేరు, కీర్తిని సంపాదిస్తాడని నమ్మకం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -