Dental Problems: లవంగంతో ఇలా చేస్తే చాలా దంత సమస్యలు పరార్?

Dental Problems: ఈ మధ్యకాలంలో చాలామంది చిన్న పెద్ద అని తేడాలేకుండా ఎదుర్కొంటున్న సమస్యల్లో దంత సమస్యలు కూడా ఒకటి. ఇదంతా సమస్య కారణంగా ఆహారం తినలేకపోవడం పానీయాలు తాగలేకపోవడం కూడా జరగదు ఉంటాయి. దీన్ని సెన్సిటివిటీ అని కూడా అంటూ ఉంటారు. ఇదంతా సమస్యలకు అనేక రకాల కారణాలు కూడా ఉన్నాయి. సరిగా బ్రష్ చేయకపోవడం, తీపి పదార్థాలు ఎక్కువగా తినడం లాంటి వాటి వల్ల పంటి నొప్పి సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. పంటినొప్పి సమస్యలకు లవంగం ఎంతో బాగా పనిచేస్తుంది. పంటి నొప్పి సమస్యలకు లవంగం ఒక చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు.

లవంగంలో కార్బోహైడ్రేట్స్, క్యాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, హైడ్రోక్లోరిక్ యాసిడ్, మాంగనీస్, విటమిన్ ఏ,సీ ఉంటాయి. ల‌వంగాలు తినడం వల్ల పళ్లు, చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. దంత సమస్యలు, చిగుళ్ల సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు లవంగాలను పొడిగా చేసి ఉపయోగిస్తే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. నోటి నుంచి ఎక్కువగా దుర్వాసన వస్తుంటే రెండు మూడు లవంగాలు నమిలితే ఫ‌లితం ఉంటుంది. లవంగాలు దంత స‌మ‌స్య‌ల నుంచి ఉప‌ష‌మ‌నం పొంద‌డానికి ఉప‌యోగిస్తారు. తరచుగా లవంగాలను తీసుకుంటూ ఉండటం వల్ల పళ్లు, చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి.

 

పంటి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వారు లవంగాల్ని పొడిగా చేసి పంటిపై, చిగుళ్ల వ‌ద్ద పెట్టుకుంటే నొప్పిని తగ్గించేస్తుంది. అందుకే టూత్‌పేస్ట్ తయారీలో లవంగాల్ని వాడుతుంటారు. నోటి దుర్వాసన స‌మ‌స్య‌ను అధిగ‌మించాలంటే రెండు లవంగాలు నోట్లో వేసుకుంటే ప‌రిష్కారం ఉంటుంది.

అలాగే తలనొప్పితో బాధపడుతున్న వారు పాలలో కొద్దిగా లవంగం పొడిని, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి నుదుటి మీద రాసుకుంటే తలనొప్పి త‌క్ష‌ణ ఉప‌ష‌మ‌నం ల‌భిస్తుంది. అలాగే తిన్న ఆహారం జీర్ణం కానివారు వాంతులు అవుతున్నట్టుగా అనిపిస్తే రెండు లవంగాలు నోట్లో వేసుకుంటే ఆ ఫీలింగ్ పోతుంది. ఆహారం కూడా జీర్ణం అవుతుంది. అంతేకాకుండా బీపీని కంట్రోల్ చేయ‌డంలో, షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయ‌డంలో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అలాగే లివర్, స్కిన్ సమస్యల్ని తగ్గిస్తాయి. లవంగాల్లో యూజెనాల్ అనే అయిల్ ఉండ‌టం వ‌ల్ల‌ నొప్పి, వాపు, మంటల్ని తగ్గిస్తుంది. అలాగే లవంగాలను నీళ్లలో రాత్రంతా నానబెట్టి ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకునే అరగంట ముందు ఆ నీటిని తాగాలి. ఇలా చేస్తే సులువుగా బరువు తగ్గుతారు. తరచుగా లవంగాల నీళ్లను తాగితే రక్తంలో ఇన్సులిన్ స్థాయి పెరిగి చక్కెర వ్యాధి నియంత్రణలో ఉంటుంది. అలాగే నీళ్లలో లవంగాలు వేసి నీళ్లు సగం అయ్యేవరకు మరిగించి తాగితే విరేచనాలు కూడా తగ్గుతాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -