Whiskey Beer: విస్కీ,బీర్ కలిపి తాగుతున్నారా.. ఇది తెలుసుకోవాల్సిందే?

Whiskey Beer: మద్యం సేవించడం, పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కూడా వాటిని విడిచిపెట్టరు. చివరికి మద్యం బాటిల్లపై కూడా మద్యం సేవించరాదు అని రాసి ఉంటారు. అయినా కూడా చాలామంది మద్యం అలవాటును మాత్రం మానుకోరు. అంతవరకు బాగానే ఉన్న చాలా మంది మద్యం మత్తులో ఏమి చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది పురుషులు మందులో నీటిని కూడా కలుపుకోకుండా పచ్చిగా అలాగే తాగేస్తూ ఉంటారు. ఇంకొందరు రకరకాల బ్రాండ్లు కలుపుకొని మరి తాగేస్తూ ఉంటారు.

ఒకవేళ విస్కీ బీర్ ఈ రెండు కలుపుకొని తాగుతుంటే మాత్రం ఇకపై అలా చేయకండి అంటున్నారు నిపుణులు. ఇవి రెండూ కలిపి తాగితే ప్రమాదం ఖాయం అంటున్నారు. మరి విస్కీ ,బీర్ కలిపి తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. విస్కీ, బీర్ మిక్స్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయట. మత్తు పెరుగుతుంది. విస్కీ, బీర్ కలిపి తాగడం లేదా ఒకదాని తర్వాత మరొకటి తాగడం వల్ల మత్తు స్థాయి పెరుగుతుంది. రెండింటిలో ఉండే ఆల్కహాల్ శాతం వల్ల మత్తు రెట్టింపుగా వస్తుంది. అలాగే విస్కీ, బీర్ కలిపి తాగడం వల్ల శరీరం త్వరగా డీహైడ్రేషన్ కు గురవుతుంది. మాములుగా ఆల్కహాల్ తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది.

 

ఈ రెండింటిని కలపడం వల్ల మరింత వేగంగా డీహైడ్రేషన్ బారిన పడతారు. దీని వల్ల తలనొప్పి, అలసట, కళ్లు తిరగడం, వాంతులు కావడం వంటివి జరుగుతాయి. అదేవిధంగా విస్కీ బీర్ కలిపి తాగడం లేదా ఒకదాని తర్వాత మరొకటి తాగడం వల్ల గ్యాస్ట్రోఇంటెస్టినల్ అప్‌సెట్‌ అవుతుంది. దీని వల్ల వాంతులు, వికారం, కడుపు నొప్పి లాంటి సమస్యలు వస్తాయి. విస్కీ, బీర్ కలపడం వల్ల హ్యాంగోవర్ మరింత తీవ్రంగా ఉంటుంది. డీహైడ్రేషన్, ఇన్ఫ్లమేషన్, ఎలక్ట్రోలైట్ ఇన్‌బ్యాలెన్స్‌ వంటి అనేక కారణాల వల్ల హ్యాంగోవర్ వస్తుంది. విస్కీ, బీర్ కలిపి తాగితే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -