Health Tips: ఎంత తిన్నా ఆకలిగా ఉందా.. ఇలా చేయండి!

Health Tips: పూర్వకాలంలో ఒక్కసారి భోజనం చేసిన తర్వాత మళ్లీ చేయాల్సిన సమయానికే ఆకలి వేసేది. ఎందుకంటే అప్పుడు వారు తీసుకునే ఆహారం అలాంటిది. ప్రస్తుం ఫర్టిలైజర్‌ను ఎరువుగా వాడుతున్న ఆహారాన్ని తీసుకోవడంతో వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నారు.కొన్ని సార్లు భోజనం చేసిన కొన్ని నిమిషాలకే మళ్లీ ఆకలి పుడుతోంది. భోజనం చేసినా తర్వాత కూడా మళ్లీ ఏదో ఒకటి వెలితిగా అనిపించి ఏదో ఒకటి తినాలని పిస్తోంది. దీనిని ఇంగ్లి్లష్‌లో ç‘ßæంగర్‌ పాంగ్స్‌’ అంటారని పోషకాహార నిపుణురాలు లవ్‌నీత్‌ బాత్రా పేర్కొన్నారు. అయితే ఇలాంటి సమస్యను ఈ చిట్కాల ద్వారా తొలగించుకోవచ్చని ఆమె సలహాలు ఇస్తున్నారు.

మీరు రోజూ కనీసం 3 పూటలా భోజనం తీసుకుంటున్నారో లేదా గమనించుకోవాలి. మూడూ పూటల ఆహారం తీసుకుంటున్నా కూడా ఆకలిగా అనిపిస్తు డయాబెటిస్, హైపర్‌ థైరాయిడిజం, డిప్రెషన్, ప్రెగ్నెన్సీ ఉండే అవకాశం ఉంటుందంట. మన మెదడు గ్రెలిన్‌ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది.. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి కడుపులో యాసిడ్‌ విడుదలను ప్రేరేపిస్తుంది. ఆహారం తీసుకోకపోతే, ఈ యాసిడ్‌ కడుపు లైనింగ్‌పై దాడి చేయడంతో ఆకలి వేస్తోంది.

మజ్జిగతో..

మజ్జిగ ప్రోబయోటిక్‌ రిచ్‌ డ్రింక్‌. ఇందులో వెయ్‌ ప్రొటీన్‌ పుష్కలంగా ఉంటుంది. మజ్జిగ తాగిన వెంటనే ఆకలి తగ్గిపోతోంది. మజ్జిగలో క్యాల్షియం, ప్రోటిన్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండటంతో ఆకలిపై ప్రభావం చూపుతాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

కొబ్బరి..

కొబ్బరిని చిరుతిండిలా తీసుకోవడానికి మంచి నిర్ణయం అని లవ్‌నీత్‌ బాత్రా అన్నారు. ఇది తరచుగా ఆకలి బాధ రాకుండా దోహదపడుతోంది. కొబ్బరి మీడియం చైన్‌ ట్రైగ్లిజరైడ్స్‌ క్యాప్రిక్, క్యాప్రిలిక్, కాప్రోయిక్, లారిక్‌ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును వేగంగా కరిగించడంతో పాటు ఆకలిని తగ్గిస్తాయి.

మొలకెత్తిన శనగలు..

మొలకెత్తిన శనగల్లో ప్రొటిన్, ఫైబర్‌ అధికంగా ఉంటాయి కాబట్టి అవి తింటే ఇప్పుడు భోజనం చేసిన ఫీలింగ్‌ కలుగుతుందట. ప్రోటిన్‌ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది ఆకలి హార్మోన్లను కంట్రోల్‌ చేస్తోంది. మనం ఆహారం పరిమితంగా తీసుకునేలా చేస్తోంది.

బాదం..

బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌–ఇ, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, ఫైబర్‌ అధికంగా ఉంటాయి. బాదంలో ఉండే ప్రొటీన్, ఫైబర్‌ ఈ రెండూ కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించేలా చేస్తాయి. మనం బాదం తింటే విటమిన్‌–ఇ లోపం, మోనోశాచురేటెడ్‌ కొవ్వుల లోపం తగ్గుతుంది. ప్రతి రోజూ బాదం తింటే తరచుగా తినే సమస్య కూడా తగ్గుతుందని ఓ అధ్యయనం ద్వారా తెలిసింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -