Vision Problems: దృష్టిలోపం ఉందా.. ఈ చిట్కాలు పాటించాల్సిందే?

Vision Problems: టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ ని వినియోగిస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ లకు బాగా ఎడిక్ట్ అయిపోవడంతో చిన్న వయసులోనే కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. గంటలు గంటలు కంప్యూటర్, ల్యాప్‌ టాప్‌ లపై పని చేసి, ఆ తరువాత కూడా ఫోన్ చూస్తూ గడిపేస్తున్నారు. అలా చేయడం చేస్తే కంటి చూపు పై, కంటి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. మొబైల్, కంప్యూటర్ స్క్రీన్ ను చూస్తున్నప్పుడు ఎక్కువగా రెప్పవేయకుండా అలా చూస్తూ ఉండిపోతారు. దీని వల్ల కళ్లు పొడిగా మారుతాయి.

 

చికాకుగా అనిపిస్తాయి. ఇలాగే కొన్ని రోజుల పాటూ కొనసాగితే కళ్ల వెంట నీళ్లు కారడం, మసకగా కనిపించడం వంటి సమస్యలు వచ్చి క్రమంగా సైట్ కూడా పెరుగుతుంది. అయితే సైట్ తో బాధపడేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే సైట్ పెరిగే అవకాశం ఉంది అని వైద్యులు చెబుతున్నారు. అయితే కొంతమంది సినిమాలు చూడడం కోసం అని ఆన్లైన్లో గేమ్ ల కోసం అని అదే పనిగా గంటల తరబడి స్క్రీన్ ముందు కూర్చుంటుఉంటారు. స్క్రీన్ ముందు ఎక్కువసేపు కూర్చునేవారు ప్రతీ 20 సెకెన్ లకు ఒకసారి స్క్రీన్ నుండి మీ చూపు మరల్చి దూరంగా ఉన్న వస్తువును 20 సెకెండ్స్ చుస్తే మంచి రిలీఫ్ వస్తుంది.

 

అలాగే తగినంత నిద్ర చాలా అవసరం. నిద్ర లేకపోతే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రావడం, చూపు మసకబారడం, కళ్ళు పొడిబారడం, వంటి సమస్యలు ఎదురవుతాయి అందుకే 7 నుండి 9 గంటల నిద్ర అవసరం. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. రోజుల తరబడి నిద్రలేమితో బాధ పడితే రోగనిరోధక శక్తి బలహీనం అవుతుంది. అంతేకాదు.. రక్తపోటు, మూడ్ ఛేంజెస్, గుండెజబ్బులు వంటివి వస్తాయట.. అలాగే ఆకుకూరలు, గ్రీన్ కలర్ వెజిటేబుల్స్, గుడ్లు, గింజలు, సి ఫుడ్ వంటివి ఎక్కువగా తీసుకుంటే అవి కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -