Cooking Youtube: ఎన్నో కష్టాలు అనుభవించి యూట్యూబ్ స్టార్ గా ఎదిగిన ఈ వ్యక్తి గురించి తెలుసా?

Cooking Youtube: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా బాగా డెవలప్ అవ్వడంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఉపయోగించి ఒకరు కూడా యూట్యూబ్ చాలా ని మొదలు పెట్టిన మొదటి రకాల వీడియోలు షేర్ చేయడం లాంటివి చేస్తున్నారు. సెలబ్రిటీల సంగతి పక్కన పెడితే సామాన్యులు కూడా సోషల్ మీడియా ద్వారా భారీగా పాపులారిటీని సంపాదించుకుంటున్నారు. రకరకాల వీడియోలను పోస్ట్ చేయడంతో పాటు యూట్యూబ్ ద్వారా లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు. చాలామంది మొదలుపెట్టి వారికి నచ్చిన పనిని కళని నలుగురికి తెలియజేస్తూ వారిలో ఉన్న ప్రతిభను బయట పెడుతున్నారు.

అలా ఒక సాధారణ వంట మాస్టర్ నుంచి 60 ఏళ్ల వయసులో వెంకటేశ్‌ ప్రముఖ యూట్యూబర్ అయ్యారు. ప్రారంభించిన రెండేళ్లలోనే తెలుగు ప్రజలకు ఎంతో చేరువయ్యారు. ఎంత అంటే అతి కొద్ది సమయంలోనే 7 కోట్లకు పైగా వ్యూస్‌ సాధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. వెంకటేష్‌ స్వగ్రామం బాపట్ల జిల్లా కొల్లూరు. ఆయన దాదాపు 40 ఏళ్లపాటు వంట మాస్టర్‌ గా పనిచేశారు. కుటుంబ పోషణ, జీవనోపాధి ఇలా కారణం ఏదైనా వంటమాస్టర్‌ గా 4 దశాబ్దాలు సేవలు అందించారు. ఎన్నో శుభకార్యాల్లో తన వంటలతో అతిథుల మనసులు గెలుచుకున్నారు. వెంకటేష్‌ అంటే చేయి తిరిగిన వంట మాస్టర్‌ అని పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకున్నారు.

 

రూటు మార్చిన వెంకటేష్ యూట్యూబర్ అయిపోయారు. ఫుడ్ ఆన్ ఫామ్ అనే ఛానల్‌ లో తన రెసిపీస్‌ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ ఫుడ్ ఆన్ ఫామ్ ఛానల్ ని మే 31, 2021న స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి వెంకటేశ్‌ రెసిపీస్ కి ఎంతో మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఆయన వంట చేసే తీరు, ఆ వాతావరణం, మరీ ముఖ్యంగా ఆయన రెసిపీని చివర్లో టేస్ట్ చూసి రివ్యూ ఇవ్వడం ఇవన్నీ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ఆ రివ్యూకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కర్నూలుకు దగ్గర్లో ఉన్న తెలంగాణలోని అలంపూర్ లో వెంకటేశ్‌ ఫామ్ ఉంది. అక్కడే వీడియోస్ చేస్తుంటారు. గోగూర పచ్చడి చేయాలి అనుకుంటా ఎంచక్కా పొలంలోకి వెళ్లి గోంగూర, పచ్చిమిరపకాయలు కోసుకొస్తారు. అలా ఎంతో న్యాచురల్ గా వీడియోస్‌ మెప్పిస్తున్నారు. అంతేకాకుండా ఆ వీడియోల్లో వినిపించే శబ్ధాలు మీ మనసుని హత్తుకుంటాయి. అలా ఒక సామాన్య వ్యక్తులా ఉన్న అతను ప్రస్తుతం యూట్యూబర్ మారి యూట్యూబ్ ఛానల్ ద్వారా లక్షలు సంపాదిస్తున్నాడు.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -