Youtube: అదిరిపోయే శుభవార్త చెప్పిన యూట్యూబ్.. వాళ్లకు మానిటైజేషన్ ఇస్తామంటూ?

Youtube: రోజు రోజుకి యూట్యూబ్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. సామాన్యుల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలు వరకు ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ ని మొదలు పెట్టడం అందులో వారికి సంబంధించిన ఎన్నో రకాల వీడియోలను షేర్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే యూట్యూబ్ వినియోగదారులకు తాజాగా యూట్యూబ్ సంస్థ ఒక చక్కటి శుభవార్తను అందించింది. అదేంటంటే.. యూట్యూబ్‌ కంటెంట్‌ క్రియేటర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. యూట్యూబ్‌ పార్టనర్‌ ప్రోగ్రామ్‌కు సంబంధించిన నిబంధనలను సవరించింది. అలాగే మానిటైజేషన్‌కు అర్హత సాధించేందుకు ఉన్న సబ్‌స్క్రైబర్ల సంఖ్యను సగానికి తగ్గించేసింది.

చిన్న క్రియేటర్లు సైతం మానిటైజేషన్‌ టూల్స్‌ను పొందేందుకు వీలుగా ఈ నిబంధనలను మార్చింది. అంటే, ఇక మీదట తక్కువ సబ్‌స్క్రైబర్ లు ఉన్న క్రియేటర్లు సైతం యూట్యూబ్‌లో డబ్బులు సంపాదించుకోవచ్చు. యూట్యూబ్‌లో మానిటైజేషన్‌కు అర్హత సాధించాలంటే కనీసం 1000 మంది సబ్‌స్క్రైబర్లు అన్న ఉండాల్సిందే. అలాగే దీంతోపాటు ఏడాదిలో కనీసం 4000 గంటల వీక్షణలు లేదా చివరి 90 రోజుల్లో కనీసం 10 మిలియన్‌ షార్ట్స్‌ వీడియో వ్యూస్‌ ఉండాలి. కాగా యూట్యూబ్‌ కొత్త మానిటైజేషన్‌ నిబంధనల ప్రకారం.. ఇకపై 500 మంది సబ్‌స్క్రైబర్లు ఉంటే సరిపోతుంది. చివరి 90 రోజుల్లో కనీసం మూడు లేదా అంతకంటే ఎక్కువ పబ్లిక్‌ వీడియోలను అప్‌లోడ్‌ చేసి ఉండాలి.

అలాగే ఏడాదిలో మూడు వేల గంటల వీక్షణలు లేదంటే చివరి 90 రోజుల్లో 3 మిలియన్‌ షార్ట్స్‌ వ్యూస్‌ ఉండాలి. ఈ కనీస అర్హతలు సాధించిన వాళ్లు ఇకపై యూట్యూబ్‌ మానిటైజేషన్‌ ప్రోగ్రామ్‌కు అప్లయ్‌ చేసుకోవచ్చు. తొలుత కొత్త మానటైజేషన్‌ నిబంధనల్ని అమెరికా, బ్రిటన్‌, కెనడా, తైవాన్‌, దక్షిణ కొరియాలో యూట్యూబ్‌ తీసుకొస్తోంది. ఆ తర్వాత త్వరలోనే మిగిలిన దేశాలకు కూడా దీనిని తీసుకురానుంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -