YCP: యూట్యూబ్ ఛానెళ్లతో అధికారంలోకి రావాలని భావిస్తున్న వైసీపీ.. ఏమైందంటే?

YCP: ఏపీలో ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉండగానే అప్పుడే ఎన్నికలకు సంబంధించిన వేడి మొదలైంది. ఒకవైపు టీడీపీ మరొకవైపు వైసీపీ అలాగే జనసేన మూడు పార్టీలు గెలవాలి అనే ఒకదాని మీద ఒకటి పోటీ పడుతున్నాయి. ఎవరు గెలుస్తారు అన్న విషయం పక్కన పెడితే మేము గెలుస్తాము అంటే మేము గెలుస్తామంటూ ఆ పార్టీ వాళ్ళు చంకలు గుద్దుకుంటున్నారు. రాజకీయాలు కూడా వేడివేడిగా సాగుతున్నాయి. ఎన్నికలలో రాణించడం కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క విన్నుత్న మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇదే వ్యూహంతో అధికార పార్టీ వైసీపీ దూసుకుపోతోంది.

 

వ‌చ్చే ఎన్నిక‌ల పోరు జోరును ముందుగానే అంచ‌నా వేస్తున్న వైసీపీ జ‌గ‌న్‌ దానికి త‌గిన విధంగా ఆయ‌న వ్యూహ ప్ర‌తివ్యూహాలు రెడీ చేస్తున్నార‌నే చ‌ర్చ వైసీపీలో జోరుగా సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌రో ప‌ది మాసాల స‌మ‌యం ఉంది. అయితే ప్ర‌తిప‌క్ష నాయ‌కులు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వ వ్య‌తిరేక ప్ర‌చారాన్ని జోరుగా పెంచారు. చాలా వ‌ర‌కు యూట్యూబ్ చానెళ్లు స‌హా ప‌త్రిక‌లు కూడా వైసీపీ స‌ర్కారు వ్య‌తిరేక వార్త‌లు నాయ‌కుల వ్య‌తిరేక వార్త‌ల‌తో నిండిపోయాయి. దీంతో తాము చేస్తున్న మంచిని ఎవ‌రూ ఎక్క‌డా చెప్ప‌డం లేద‌ని వైసీపీ అధినేత త‌ర‌చుగా వాపోతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌తిపక్షాలు మ‌రింత‌గా రెచ్చిపోవ‌డం ఖాయ‌మ‌ని భావిస్తున్న సీఎం జ‌గ‌న్‌ ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రాష్ట్రంలో 200ల‌కు పైగా వ్య‌క్తిగా యూట్యూబ్ చానెళ్ల‌ను ప్రోత్స‌హించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం.

గ‌త రెండు నెల‌ల కాలంలో సుమారు 30 యూట్యూబ్ చానెళ్లు వైసీపీకి అనుకూలంగా రావ‌డం గ‌మ‌నార్హం. ఇవి వ్య‌క్తిగత చానెళ్లే అయిన వైసీపీ కార్య‌క్ర‌మాల‌ను ప్రోత్స‌హించ‌డం కొన్ని చానెళ్లు చేస్తుంటే మ‌రికొన్ని చాలా వ్యూహాత్మ‌కంగా వైసీపీని ప్ర‌మోట్ చేసే కార్య‌క్ర‌మాలు చేస్తున్నాయి. ఇంకా కొన్ని గ‌త పాల‌న‌ను ప్ర‌స్తుత పాల‌న‌ను పోలుస్తూ వివిధ ప‌థ‌కాల విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తున్నాయి. అయితే ఇది చాల‌ద‌న్నట్లు మ‌రిన్ని చానెళ్ల‌ను ఏర్పాటు చేసేలా క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌ను ప్రోత్స‌హించాల‌ని అధిష్టానం ఆదేశించిన‌ట్టు తెలిసింది. అలా మొత్తానికి 200 యూట్యూబ్ చానెళ్ల ఏర్పాటే ల‌క్ష్యంగా వైసీపీ నాయ‌కులు ముందుకు సాగుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -