Sri Reddy: మేము చెడిపోయాము.. మీరు చెడిపోవద్దు అంటూ షాకింగ్ కామెంట్స్!

Sri Reddy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటించిన శ్రీ రెడ్డి అనంతరం ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతూ అర్థనగ్న ప్రదర్శన చేశారు. ఇలా కాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా ఒక్కసారిగా ఫేమస్ అయిన ఈమె అప్పటినుంచి నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఇక శ్రీరెడ్డి నోరు విప్పిందంటేనే పెద్ద ఎత్తున వివాదం చెలరేగేదని చెప్పాలి.

అయితే ఈ మధ్యకాలంలో శ్రీ రెడ్డి వివాదాలకు కాస్త దూరంగా ఉంటూ ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారని చెప్పాలి.సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్నో రకాల వంట వీడియోలతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను అభిమానులను సందడి చేస్తున్నారు. ఇలా ఎన్నో రకాల వంటలను తయారు చేసిన ఈమె తాజాగా కింగ్ చేప పెద్దసేన కూర వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ వీడియోలో ఎప్పటిలాగే ప్రకృతి అందాల నడుమ శ్రీరెడ్డి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఈ కూరను ఎలా తయారు చేయాలో చూపించారు. అలాగే ప్రకృతి అందాల నడుమ ఈమె తన అందాలను ఆరబోసి పెద్ద ఎత్తున రచ్చ చేస్తుంటారు. ఇకపోతే తాజాగా ఈ వంట వీడియో ద్వారా ఈమె యువతులకు కావలసిన జాగ్రత్తలను కూడా సూచించారు.ఇకపోతే ప్రస్తుత కాలంలో ఎంతోమంది యువత వస్త్రధారణ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

యువతులు బయటకు ఎక్కడికి వెళ్ళినా కూడా నిండుగా దుస్తులు ధరించి వెళ్ళమని ఈమె సూచించారు.తాను కూడా బయటకు వెళ్ళినప్పుడు నిండుగా దుస్తులు వేసుకొని వెళ్తానని ఇలా వీడియోలు చేసేటప్పుడు మాత్రమే తన వస్త్రధారణ ఇలా ఉంటుందని ఈమె తెలిపారు. అయితే వస్త్రధారణ వల్ల ప్రపంచంలో రేపులు జరుగుతున్నాయని తాను చెప్పడం లేదని, అయినా బయటకు వెళ్లేటప్పుడు మంచి దుస్తులు వేసుకోమని సూచించారు.ఒకప్పుడు మేం కూడా ఇలాంటి దుస్తులు వేసుకుని చెడిపోయాము మీరు అలా కాకూడదని చెబుతున్నాను అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -