NTR-Balakrishna: ఎన్టీఆర్, బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన బాహుబలి లాంటి మూవీ ఏదో తెలుసా?

NTR-Balakrishna: టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బాహుబలి. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ను సాధించిందో మనందరికీ తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు రాజమౌళి. ఈ మూవీతో దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా అందరి చూపు టాలీవుడ్ ఇండస్ట్రీ పై పడింది. ఇప్పట్లో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాను అప్పట్లోనే ఎన్టీ రామారావు బాహుబలి లాంటి సినిమాను తెరకెక్కించారట. ఆ సినిమాలో ఎన్టీఆర్ తో పాటుగా బాలకృష్ణ కూడా నటించారు.

కానీ ఆ చిత్రం మాత్రం రిలీజ్ కాలేదు. మరి అంత పెద్ద సినిమా రిలీజ్ కాకపోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎన్టీ రామరావుగారు అప్పట్లోనే బాహుబలి లాంటి చిత్రాన్ని ప్రకటించి, చిత్రీకరణ మొదలు పెట్టారట. కొంత సినిమా షూటింగ్ అయిన తరువాత ఆ మూవీ ఆగిపోయింది. ఆ సినిమా పేరు కంచు కాగడ. ఉప్పలపాటి విశ్వేశ్వరరావు ఈ సినిమాని బాలకృష్ణతో ఒక భారీ జానపద సినిమా చేయాలని అనుకున్నారట. అయితే సినిమా ఆలస్యం అవడంతో ఆ విరామంలో ఇంకో కథను రాసి కంచుకోట అనే చిత్రాన్ని నిర్మించారట. ఈ సినిమాకి కేఎస్ రావు దర్శకత్వం చేయగా, ఇందులో బాలకృష్ణ కీలకమైన పాత్రలో నటించారు.

 

ఇక ఈ మూవీలో సావిత్రి, దేవిక హీరోయిన్ లుగా చేశారు. అప్పట్లోనే ఈ చిత్రానికి ఏడు లక్షల బడ్జెట్ పెట్టాడం విశేషం. ఈ మూవీ 30 సెంటర్లలో రిలీజ్ అయ్యి కేవలం ఏడు రోజుల్లోనే సినిమాకి పెట్టిన ఏడు లక్షలు వసూలు చేసింది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్, బాలకృష్ణతో కంచు కాగడా చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఈ సినిమాకి విశ్వేశ్వరరావు నిర్మాత. ఇది కూడా జానపద సినిమాగానే తెరకెక్కాల్సింది. ఇందులో హీరోయిన్ గా జమునను తీసుకున్నారు. ఎన్టీఆర్, బాలకృష్ణలతో కొంత షూటింగ్ పూర్తి అయింది. ఆ తరువాత జమున గర్భవతి కావడంతో, ఆమె ప్రసవమయ్యాక మిగతా షూటింగ్ చేద్దామని అనుకున్నారు. దానికి ఎన్టీఆర్ కూడా సరే అన్నారు. అయితే ఆ తరువాత ఈ సినిమాలో కీలకపాత్రలో నటించే బాలీవుడ్ హీరో చనిపోవడంతో ఈ చిత్రం ఆగిపోయింది. అయితే అప్పట్లో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో బాహుబలి రేంజ్ లో తీయాలని అనుకున్నారట మూవీ యూనిట్.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -