Relationship: వారానికి ఎన్నిసార్లు సెక్స్ లో పాల్గొనాలో తెలుసా?

Relationship: చాలామంది పురుషులు శృంగారం గురించి ఇతరులతో మాట్లాడడానికి చర్చించడానికి ఇష్టపడరు. శృంగారానికి సంబంధించిన విషయాలను ఎక్కువగా గోప్యంగా ఉంచడానికే ఇష్టపడుతూ ఉంటారు. శృంగారం కారణంగా మానసిక, శారీరక, ఎమోషనల్ గా ఆరోగ్యంగా బాగుంటుంది. శృంగారం చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. శృంగార జీవితాన్ని ఆనందిస్తూ ప్రతిరోజూ సెక్స్ లో పాల్గొనేవారిలో ఆరోగ్య సమస్యలు చాలా తక్కవగా వస్తాయి. ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడానికి ఇది ప్రధాన కారణం.

 

అందుకోసమైనా కచ్చితంగా సెక్స్ ని ఆస్వాదించాలి. ఇకపోతే సైన్స్ ప్రకారం వారానికి ఎన్ని శృంగారంలో పాల్గొనాలి అన్న విషయానికి వస్తే.. వారానికి రెండు సార్లు శృంగారంలో పాల్గొనడం మంచిది అంటున్నారు నిపుణులు. శృంగారం కారణంగా బీపీ కంట్రోల్ లో ఉంటుంది. అయితే ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో రోగనిరోధక శక్తి పెంచుకోవడం చాలా అవసరం. ఆ అవసరాన్ని సెక్స్ మనకు తీరుస్తుంది. తరచూ శృంగారంలో పాల్గొనేవారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. తరచూ సెక్స్ లో పాల్గొనడం అనేది ఒక వ్యాయామం లాంటిది. దాని వల్ల గుండె సంబంధిత వ్యాధులు త్వరగా దరిచేరవు.

 

పనితీరు కూడా బాగుంటుంది. అంతేకాకుండా ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ లను బ్యాలెన్స్ చేస్తుంది. వారానికి కనీసం రెండు సార్లు శృంగారంలో పాల్గొనే వారిలో హౄదయ సంబంధిత సమస్యలు చాలా తక్కువగా వస్తాయి. అలాగే చాలా రకాల నొప్పులకు కూడా శృంగారం మందులాగా పనిచేస్తుంది. తలనొప్పి, కాళ్ల నొప్పులు మహిళల పీరియడ్ పెయిన్స్ వీటన్నింటికీ దూరంగా ఉంచుతుంది. శృంగారంలో పాల్గొనడం వల్ల మంచి నిద్ర వస్తుంది. అంతేకాకుండా శృంగారంలో పాల్గొనే వారితో పోలిస్తే పాల్గొన్నని వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -