Katrina Kaif: వామ్మో.. కత్రినా ధరించిన స్వెటర్ ధర ఇంతనా!

Katrina Kaif: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. మల్లీశ్వరి సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అప్పటి ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఇక ఈ గ్లామర్ బ్యూటీ అందం గురించి మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీలో అంతగా కనిపించలేదు.

పుట్టినిల్లు లాంటి బాలీవుడ్ లో మంచి మంచి అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోల సరసన నటించింది. తన అందం తో బాలీవుడ్ ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతుంది. ఇక ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో కూడా యమా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ అందాలను ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటుంది.

ఇక ఇదే క్రమంలో తాజాగా కత్రినా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పోస్టులో కత్రినా ఒక అట్రాక్టివ్ లుక్ తన సొంతం చేసుకుంది. ఒక అదిరిపోయే స్వెటర్ ధరించింది. దానికి సెట్ అయ్యే విధంగా ఒక డేనిమ్ ప్యాంట్ తో చూసేవారి మతులు పోగొడుతుంది. ఆ ఫోటోలో కత్రినా కైఫ్ అందాలు.. ఎంతో హాట్ గా అనిపిస్తున్నాయి. నెటిజన్లు తన హాట్ నెస్ ని కామెంట్లో రూపంలో తెలియజేస్తున్నారు.

ఇక కత్రినా కైఫ్ ధరించిన ఆ స్వెటర్ ధర విషయానికి వస్తే.. 445 డాలర్లని తెలుస్తుంది. అంటే అక్షరాల మన ఇండియన్ కరెన్సీలో 35వేల రూపాయలు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కత్రినా తన స్వెటర్ కోసం ఇంత ఖర్చు చేసిందా అని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం కత్రినా కైఫ్ పంచుకున్న ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి మీరు కూడా ఆ పోస్ట్ వైపు ఒక లుక్కెయ్యండి. ఏదేమైనా కత్రినా ఆ స్వెటర్ లో నెటిజన్ల మతులు పోగొడుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -