Katrina Kaif: కత్రినా కైఫ్ ను టెంప్ట్ చేయడం కోసం హీరో చేసిన పని తెలిస్తే షాకవ్వాల్సిందే!

Katrina Kaif: సాధారణంగా ఎవరి జీవితంలో అయినా పెళ్లయ్యాక గొడవలు పడటం అనేది సర్వసాధారణం. అసలు గొడవ పడకపోతే వారి మధ్య సఖ్యత లేనట్టే అంటారు మానసిక నిపుణులు. అలగటం ఆ అలక తీర్చడం అనేది ఒక్కొక్క జంటలో ఒక్కొక్క విధంగా ఉంటుంది.
ఇంతకీ విషయం ఏంటంటే బాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద క్యూట్ అండ్ సెక్సీ దంపతులుగా పేరు సంపాదించుకున్న కత్రినా కైఫ్, వికీ కౌశల్ ఎంత అన్యోన్యంగా ఉంటారో మనందరికీ తెలిసిందే.

చాలా రోజులు డేటింగ్ చేసిన తరువాత వారు పెళ్లి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ లవ్లీ కపుల్ ఈ మధ్యనే తమ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ని రొమాంటిక్ గా సెలబ్రేట్ చేసుకొని వైరల్ అయ్యారు. మరి ఇంత అన్యోన్యమైన జంట ఎప్పుడూ గొడవలు పడదా అంటే మేము కూడా గొడవలు పడతాం అంటున్నారు ఈ క్యూట్ కపుల్. కత్రినా కూడా అందరి అమ్మాయిలాగే భర్త మీద అలుగుతుందట.

అయితే భార్య వీక్నెస్ తెలిసిన విక్కీ ఆమెకి ఇష్టమైన గులాబ్ జామున్ తో ఆమెని ఫ్లాట్ చేసేస్తాడట. కత్రినాకి గులాబ్ జామున్ అంటే ఎంత ఇష్టమంటే డైటింగ్ లో ఉన్నప్పటికీ జామున్ కనిపిస్తే వదిలిపెట్టనంత ఇష్టం అట. అందుకే కత్రినా కి కోపం వచ్చినా వెంటనే విక్కీ గులాబ్ జామున్ చేసి భార్యకి తినిపిస్తాడట. అంతే కాకుండా తీరిక దొరికిన ప్రతిసారి టీవీలో కామెడీ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తారట. యూట్యూబ్లో ఫన్నీ వీడియోస్, మీమ్స్ చూడటం వీరికి స్ట్రెస్ రిలీఫ్ ఇస్తుందంట.

 

కొసమెరుపు ఏమిటంటే ఇన్ని రోజులు ఉపాసన వెంటపడ్డ జనాలు ఇప్పుడు పెళ్లయి సంవత్సరం అయినా గుడ్ న్యూస్ చెప్పడం లేదంటూ కత్రినా వెంట పడ్డారు. బాలీవుడ్ స్టార్ ప్రముఖులు కూడా కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ మీద ఇంట్రెస్ట్ చూపించడం విస్మయాన్ని కలిగిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -