Rohit Sharma: రోహిత్ శర్మ కెప్టెన్సీపై యువరాజ్ సింగ్ ఎంత రేటింగ్ ఇచ్చాడో తెలుసా?

Rohit Sharma: టీమిండియా గెలుపోటములతో ముందుకు సాగుతోంది. గెలుపు బాటలో ప్రయాణిస్తుంది అనుకునే లోపే ఓటమి రుచి చూస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం అదరగొట్టేలా ఉన్నా బౌలింగ్ లోనే టీమిండియా వెనకబడుతోంది. ఇక ప్రస్తుతం టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్ గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టడం తెలిసిందే.

 

గత సంవత్సరం నవంబర్ లో టీ20 మరియు వన్డేలకు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ.. ఈ ఏడాది మూడు ఫార్మాట్ల కెప్టెన్సీని చేపట్టాడు. అయితే కొన్ని సిరీస్ లకు మాత్రం రోహిత్ శర్మ అందుబాటులో లేడు. రోహిత్ శర్మగా కెప్టెన్ గా వ్యవహరించినప్పుడు టీమిండియా న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలాంటి టీమ్స్ మీద విజయం సాధించింది. అలాగే ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లలో మాత్రం విఫలమైంది.

 

దీంతో రోహిత్ శర్మ టీంని ఎలా నడిపిస్తున్నాడనే చర్చ మొదలైంది. తాజాగా రోహిత్ కెప్టెన్సీ నిర్వహణ మీద టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ను ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం చెప్పాడు. టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మకు మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అనే ప్రశ్నకు యువీ తనదైన స్టైల్ లో సమాధానమిచ్చాడు.

 

రోహిత్ శర్మ కెప్టెన్సీకి యువరాజ్ సింగ్ పదికి పది రేటింగ్ ఇస్తానని తెలిపాడు. అయితే రోహిత్ కెప్టెన్ గా పూర్తిస్థాయి ఆటను యువీ లెక్కలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడు కెప్టెన్ గా వ్యవహరించిన అన్ని మ్యాచులను లెక్కలోకి తీసుకుంటే ఓవరాల్ గా రోహిత్ శర్మ కెప్టెన్సీ బెస్ట్ అనే అనిపిస్తుంది.

తాజాగా బంగ్లాదేశ్ లో జరిగిన మొదటి వన్డే మ్యాచులో టీమిండియా ఓటమిని, అంతకు ముందు టీ20 వరల్డ్ కప్ లో ఓటమిని మాత్రమే లెక్కలోకి తీసుకోకుండా రోహిత్ శర్మ కెప్టెన్సీని పూర్తిగా లెక్కలోకి తీసుకోవాలి. రోహిత్ శర్మ ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 70 మ్యాచులకు కెప్టెన్ గా వ్యవహరించాడు. అందులో టీమిండియా 54 మ్యాచులు గెలిచింది. అంటే రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నప్పుడు విజయాల శాతం 77.14%గా ఉంది.

వన్డేల్లో 17 మ్యాచుల్లో 13 వన్డేల్లో టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే విజయం సొంతమైంది. ఇక టీ20ల్లో అయితే 51 మ్యాచ్‌లలో 39 మ్యాచుల్లో టీమిండియా గెలవగా.. 12 మ్యాచుల్లో ఓడిపోయింది. మొత్తానికి టీమిండియా కెప్టెన్ గా యువరాజ్ అభిప్రాయపడినట్లు బెస్ట్ గానే చేస్తున్నాడనే దానిలో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే త్వరలోనే టీమిండియా కెప్టెన్ మారతారనే ప్రచారం సాగుతుండటం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -