Sundarakanda Heroine: వామ్మో… గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సుందరకాండ హీరోయిన్..?

Sundarakanda Heroine: ఇండస్ట్రీలో అవకాశాలు మాత్రమే ఉండి అదృష్టం లేకపోతే ఎన్ని సినిమాలలో నటించిన కూడా గుర్తింపు సంపాదించుకోవడం కష్టం. కానీ కొంతమంది హీరో హీరోయిన్లు వారు నటించిన ఒకటి రెండు సినిమాలకే సెలబ్రెటీలుగా మంచి గుర్తింపు పొందారు. ఒకే ఒక్క సినిమాకు స్టార్ గా మారిపోయిన వారిలో అపర్ణ కూడా ఒకరు. అపర్ణ అంటే గుర్తుకు రాకపోవచ్చు… కానీ సుందరాకాండ సినిమాలో వెంకటేష్ ని అల్లరి పట్టించిన స్టూడెంట్ అనగానే అందరికీ టక్కున గుర్తుకువస్తుంది. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన సుందరకాండ సినిమాలో హీరోయిన్ మీనా తో పాటు అపర్ణ కూడా నటించి మంచి గుర్తింపు పొందింది.

ఈ సినిమాలో లెక్చరర్ ని ప్రేమించి అల్లరి చేస్తూ చిలిపి చేష్టలతో అపర్ణ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సినిమాలో ఈమె నటించిన పాత్ర ప్రేక్షకులకు మదిలో నిలిచిపోయిందనటంలో ఆశ్చర్యం లేదు. ఇలా తన నటించిన మొదటి సినిమాతోనే అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్న అపర్ణ ఆ తర్వాత ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చిన కూడా కుటుంబం కోసం సినిమాలలో నటించనని తేల్చి చెప్పింది.

ఈ సినిమా అనంతరం తనకి గుర్తింపు తెచ్చిపెట్టిన రాఘవేంద్ర రావు గారు కూడా ఎన్నోసార్లు బ్రతిమిలాడినా కూడా ఆమె నటించటానికి అంగీకరించలేదు. ఇలా సుందరకాండ సినిమా ద్వారా గుర్తింపు పొందిన అపర్ణ అమెరికాకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకొని అక్కడే సెటిల్ అయింది. ఇటీవల ఒక ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలు పాల్గొన్న అపర్ణ తన వ్యక్తిగత విశేషాలు గురించి ఎన్నో విషయాలు వెల్లడించింది.

ఈ క్రమంలో సెకండ్ ఇన్నింగ్స్ ఏమైనా ఉంటుందా? యాంకర్ అడిగిన ప్రశ్నకి అపర్ణ స్పందిస్తూ.. చూడాలి అంటూ నవ్వుతూ సమధానం చెప్పింది. ఇక ప్రస్తుతం అపర్ణ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే సెకండ్ ఇన్నింగ్స్ గురించి ఈమె చేసిన సమాధానం వింటే మాత్రం ఇప్పుడు కాకపోయినా మరికొన్ని రోజుల్లో ఆయన ఈమె తెరపై కనిపించే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. మరి ఈమె నిజంగానే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -