రైలు ప్రయాణం లో ఫుడ్‌ ఎలా ఆర్డర్‌ చేయాలో తెలుసా?

మనం దూర ప్రాంతాలకు నాలుగైదు రోజుల ప్రయాణం చేయాల్సి ఉంటే రైలులోనే వెళ్తేందుకు నిర్ణయించుకుంటాం. ఎందుకంటే కుటుంబ సభ్యులంతా ఒకే చోటు ఉండి ప్రయాణించేందుకు సౌకర్యవంతంగా, మరియు సురక్షితంగా ఉంటుంది కాబటి. అయితే మనం చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి మనం ఇంటి నుంచి భోజనం తీసుకెళ్తుంటాం. ఒకరోజు రెండ్రోజులంటే మనం తీసుకెళ్లే భోజనం తినొచ్చు ఆ తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తోంది.

అయితే ఇప్పుడు రైల్‌లో వెళ్లేందుకు టికెట్‌ బుక్‌ చేసే సమయంలోనే ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకునే సదుపాయం ఉంది. అందుకు ఐఆర్‌సీటీసీ వాళ్లు అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. లేదంటే ఐఆర్‌సీటీసీ ప్రతినిధులు మీ వద్దకే వచ్చి మీరు కోరుకునే భోననాన్ని ఆర్డర్‌ తీసుకుంటారు. ఈ రెండు సందర్భాల్లో మీకు ఆర్డర్‌ చేయడం కుదరకపోతే.. ఏం చేయాలి అలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఐఆర్‌సీటీసీ ఓ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మీ వాట్సాప్‌ నంబరు నుంచే మీకు కావాల్సిన ఆహారాన్ని ట్రైన్‌లో ఆర్డర్‌ చేసుకునే సదుపాయం కూడా ఉంది. సీటీసీ వాళ్లు భోజనం ఏర్పాట్లు కూడా చేస్తారు.

జియోకు చెందిన హాప్టిక్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌తో కలిసి ఐఆర్‌సీటీసీ ఫుడ్‌ డెలివరీ సర్వీస్‌ జూప్‌ ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్‌లో జూప్‌ చాట్‌బోట్‌ సర్వీస్‌ ద్వారా ఈజీగా భోజనం ఆర్డర్‌ చేయచ్చు. మీరు భోజనం ఆర్డర్‌ చేస్తే తర్వాత వచ్చే స్టేషన్‌లో మీ ఆర్డర్‌ రెడీగా ఉంటుంది. అంతేకాకుండా ఆన్‌ లైన్‌ యాప్స్‌లాగా మీ ఆర్డర్‌ ఎక్కడ ఉందో కూడా టాక్‌ చేసుకోవచ్చు.

ఇలా చేయాలి..

1.వాట్సాప్‌లో జూప్‌ చాట్‌ బోట్‌ నంబర్‌..7042062070కు హాయ్‌ అని మెసేజ్‌ చేయాలి. అప్పుడు అక్కడే ఆటో రిప్లై మెసేజ్‌ ఒకటి వస్తుంది. అందులో కొన్ని ఆప్షన్స్‌ ఉంటాయి.

2.వచ్చిన ఆప్షన్స్‌ లో ఫుడ్‌ ఆర్డర్‌ సెలెక్ట్‌ చేసుకోని మీరు ఆర్డర్‌ సెలెక్ట్‌ చేసిన తర్వాత మీ పీఎన్‌ఆర్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయమని అడుగుతుంది.

3.మీ ట్రైన్‌ నంబరు..మీ బెర్త్‌ నంబరును కన్ఫామ్‌ చేయమని కోరుతుంది. అది చూసుకుని కరెక్ట్‌ అయితే ఎస్‌ అనే ప్రొసెస్‌ను అనే ప్రొసెస్‌ను సెలెక్ట్‌ చేయాలి.

4. తర్వాత వచ్చే స్టేషన్‌ సెలక్ట్‌ చేస్తే అందుబాటులో ఉన్న రెస్టారెంట్‌ వివరాలు వస్తాయి.ఆ వివరాల్లో మీకు నచ్చిన రెస్టారెంట్‌ ను ఎంపిక చేసుకుని ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తే తర్వాతి స్టేషన్‌లో జూప్‌ మీరు ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ రెడీగా ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: ఓటమి భయంతో జగన్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారా.. ఈ ప్లాన్స్ కు అడ్డుకట్ట వేసేదెవరు?

YS Jagan: ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వార్ వ‌న్‌సైడ్ గా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూట‌మికి ప్ర‌జాద‌ర‌ణ పెరుగుతోంది. ఈ...
- Advertisement -
- Advertisement -