Banana Leaf: అరటిఆకులో భోజనం చేస్తే.. కలిగే లాభాలు ఇవే?

Banana Leaf: ఇప్పుడఅంటే కాలం మారిపోయి స్టీల్, సిల్వర్, గాజు ప్లేట్ లలో భోజనం చేస్తున్నారు. బాగా డబ్బు ఉన్న వారు వెండికంచాలలో కూడా భోజనం చేస్తుంటారు. కానీ ఒకప్పటి రోజుల్లో ఎక్కువ శాతం అరిటాకులో భోజనం. అరిటాకులో భోజనం అంటే సంతోషంగా తినేవారు. అరిటాకులో భోజనం చేయడం అన్నది మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. మరి అన్ని ఆకులుండగా అరటి ఆకుని ఎందుకు ఎంచుకున్నారు. ఇప్పట్లో చాలా తక్కువగా మాత్రమే అరిటాకులో భోజనం చేసేవారు కనిపిస్తూ ఉంటారు. పల్లెటూర్లలో పొలం పనులకు వెళ్లిన వారు మాత్రమే ఇలా అరిటాకులో భోజనం చేస్తూ ఉంటారు.

అయితే అరిటాకులో భోజనం చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి అంటున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అరిటాకులో భోజనం చేయడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. మనం తినే ఆహారంలో కనుక విషం ఉంటే ఆ అరిటాకు నలుపు రంగులోకి మారిపోతుంది. అందుకే అరటి ఆకులో అన్నం పెడితే శత్రువులు కూడా ఇటువంటి భయం లేకుండా భోజనం చేస్తుంటారు. అరటి ఆకులపై వడ్డించిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అనేక రకాల సమస్యలను నిరోధించే శక్తి అరటిఆకులో ఉంది.

 

భోజనం చేసిన తర్వాత ఈ ఆకులను బయట పడేసినా తొందరగా మట్టిలో కలిసిపోతాయి. తద్వారా పర్యావరణానికి మేలు చేసినట్టు కూడా అవుతుంది. వేడివేడిగా ఉండే భోజనాన్ని అరటి ఆకుపై పెట్టగానే దానిపై ఉండే ఒక పొర కరిగి అన్నంలో కలిసిపోతుంది. ఇది అన్నానికి ఒకరకమైన రుచిని ఇస్తుంది. అరటిఆకులో భోజనం చేయడం వల్లన ఆకలి పెరుగుతుంది, ఆరోగ్యవంతులుగా ఉంటారు. హిందుధర్మశాస్త్రం ప్రకారం మనిషి కూర్చున్న తరువాతే అన్నం వడ్డించాలి. వడ్డించిన విస్తరి ముందు కూర్చోరాదు. ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మనకోసం అన్నం ఎదురుచూడరాదు.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -