Health Tips: వామ్మో.. నిలబడి ఆహారం తింటే అంత డేంజరా?

Health Tips: మాములుగా మనం ఎక్కడికైనా బయటకు హోటల్స్ లేదా రోడ్డు పక్కన షాప్స్ దగ్గర ఏవైనా ఆహార పదార్థాలు తింటున్నప్పుడు ఎక్కువగా నిలబడే తింటూ ఉంటారు. కొన్ని కొన్ని ప్రదేశాల్లో మాత్రమే కూర్చొని తింటూ ఉంటారు. కానీ చాలామంది కూర్చుని తినడం కంటే తొందర తొందరగా తినేసి వెళ్లిపోవాలి అన్న ఉద్దేశంతో నిలబడి తింటూ ఉంటారు. పెళ్లిళ్లలో కూడా ఈ మధ్యకాలంలో ఒక చోట నిలబడి వడ్డిస్తే ప్లేట్లో వడ్డించుకుని వెళ్లి నిలబడి తింటూ ఉంటారు. అయితే అలా నిలబడి తినడం ఏ మాత్రం మంచిది కాదు అంటున్నారు నిపుణులు.

అయితే తినేది ఒక్క ముద్ద అయినా కూడా కూర్చొని తినడం మంచిది అంటున్నారు నిపుణులు. బయటకు తినడానికి వెళ్ళినప్పుడు ప్లేస్ లు ఉండవు కదా మరి అలాంటప్పుడు ఎలా అంటే ఆ సమయంలో అడ్జస్ట్ అవ్వాలి కానీ ప్రతిసారి కూడా అలాగే నిలబడి తినకూడదని అంటున్నారు. తినడం వల్ల అది మిమ్మల్ని వ్యాధుల బారిన పడేలా చేస్తుంది. నిలబడి భోజనం చేయడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నేలపై కూర్చుని తింటున్నప్పుడు మనం ఆహారం తీసుకుంటున్నాము అని మనసుకు ఒక సందేశం వెళ్తుంది. అక్కడ నిలబడి ఆహారం తినడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

 

నిలబడి ఆహారం తినే అలవాటు ఉన్నవారు తరచుగా ఎక్కువ ఆకలితో ఉంటారు. తరచుగా ఆహారం తినాలనే కోరిక అనేక ఇతర వ్యాధులకు కారణమవుతుంది. నిలబడి ఆహారం తీసుకునే విధానం జీర్ణవ్యవస్థను చాలా వరకు ప్రభావితం చేస్తుంది. నిజానికి నిల్చుని ఆహారం తీసుకోవడం వల్ల ఆహారం పేగుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితిలో జీర్ణవ్యవస్థలో ఇబ్బందులు తలెత్తుతాయి. చాలామంది సమయాన్ని ఆదా చేసుకునేందుకు కొందరు నిలబడి ఆహారం తీసుకుంటారు. ఆ సమయంలో వారు ఆహారాన్ని కూడా సరిగ్గా నమలలేరు. ఈ పద్ధతి కడుపు సమస్యలను కలిగిస్తుంది. కడుపు ఉబ్బరంకు దారితీస్తుంది.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -