Prabhas: ప్రభాస్ లవర్ పేరు ఇదే.. అప్పుడే ప్రేమలో పడ్డాడా?

Prabhas: నందమూరి బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ సీజన్-2’ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. తాజాగా ఈ షోకి గెస్టుగా రెబల్ స్టార్ ప్రభాస్ రానున్నట్లు ఆహా ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేసింది. రిలీజ్ చేసిన 14 గంటల్లోనే ఈ వీడియో 3.3 మిలియన్ వీవ్స్ దక్కించుకుంది. దీంతో ఈ ఎపిసోడ్‌ను చూసేందుకు కోట్లాది మంది ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రోమో ఆధారంగా చూసినట్లయితే.. ప్రభాస్ మునుపెన్నడూ లేని విధంగా కనిపించారు. ఏ షోకి వెళ్లినా సైలెంట్‌గా ఉండే ప్రభాస్.. అన్‌స్టాపబుల్‌ షోని మాత్రం తెగ ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తోంది. అలాగే బాలయ్య కూడా తనదైన స్టైల్‌లో ప్రభాస్-గోపీచంద్‌ను ఆటపట్టించిన తీరు జనాలను ప్రత్యేకంగా ఆకట్టుకుంది.

 

 

ఈ ప్రోమోను మనం ఒక్కసారి చూసినట్లయితే.. బాలయ్య.. బాహుబలి డైలాగ్స్ తో ప్రభాస్‌ను వెల్‌కమ్ చెప్తాడు. స్టేజ్‌పైకి వచ్చిన ప్రభాస్‌ను ‘నన్ను ఒక్కసారి డార్లింగ్ అని పిలవవా?’ అని బాలయ్య అడగటంతో.. ప్రభాస్ ‘డార్లింగ్ సార్’ అని ముద్దుగా పిలుస్తాడు. దీంతో ఒక్కసారిగా షోలో ఉన్న ఆడియన్స్ అరుపులు, కేకలతో స్టేజ్ దద్దరిల్లిపోయింది. అలాగే ఒక టాస్క్‌ లో భాగంగా.. ప్రభాస్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన రామ్ చరణ్‌కు కాల్ చేస్తాడు. అప్పుడు వీరి మధ్య సంభాషణలో గర్ల్ ఫ్రెండ్ ప్రస్తావన వస్తుంది. దానికి ప్రభాస్ ‘రేయ్ చరుణు.. నువ్వు నా ఫ్రెండువా.. లేక శత్రువా రా..’ అంటూ తన స్లాంగ్‌లో అడిగేశాడు. దీంతో బాలయ్య ఒక్కసారిగా షాక్ అవుతాడు.

 

ఆ తర్వాత హీరో గోపీచంద్ ఎంట్రీ ఇస్తాడు. గోపీచంద్ వచ్చిరాగానే ప్రభాస్‌ను అడ్డంగా బుక్ చేసి పడేశాడు. బాలయ్య.. ‘ప్రభాస్‌ను నీ క్లోజ్ ఫ్రెండ్‌కి కాల్ చేయమని చెప్తే రామ్ చరణ్‌కు కాల్ చేశాడు. అప్పుడు ఓ మాట చెప్పాడు.. నీకు ఏమైనా తెలుసా?’ అని గోపీచంద్‌ను అడుగుతాడు. దానికి గోపీచంద్.. ‘రాణి మ్యాటరే కదా సార్’ అంటూ ఓపెన్ అప్ అయ్యాడు.

 

దీంతో రాణి ఎవరో తెలుసుకోవడానికి నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రభాస్ తన ఫోన్‌లో సేవ్ చేసుకున్న రాణి అనే పేరు ఎవరిదో కాదు.. లెజెండరీ డైరెక్టర్ రాజమౌళిది. అవును ఇది నిజం. ప్రభాస్ రాజమౌళిని ముద్దుగా రాణి అని పిలుచుకుంటాడట. ఆ తర్వాత బాలయ్య గోపీచంద్ ఇండస్ట్రీలో పడిన స్ట్రగుల్స్, ప్రభాస్‌తో ఎలా పరిచయం, తదితర ప్రశ్నలను అడుగుతాడు. అలాగే ఓ ఫోటోను చూపించిన బాలయ్య.. ‘సార్.. ఈ ఫోటోను చూస్తే మా అమ్మ టెన్షన్ పడుతుంది. సోషల్ మీడియాతో నేను వేగలేను.. నువ్వు ఆ స్టోరీ గురించి మొత్తం చెప్పు అని గోపీచంద్‌కు ప్రభాస్ చెప్తాడు.’ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండింగ్‌గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -