Manchu Manoj-Mounika Reddy: మనోజ్ కు భూమా మౌనిక ఇచ్చిన కట్నం ఎంతో తెలుసా?

Manchu Manoj-Mounika Reddy: టాలీవుడ్ హీరో మంచు మ‌నోజ్ ఓ ఇంటివాడ‌య్యాడు. భూమా మౌనికారెడ్డి మెడ‌లో మూడు ముళ్లు వేశాడు. శుక్ర‌వారం రాత్రి హైదరాబాద్ ఫిలింనగర్ లోని మంచు లక్ష్మి ఇంట్లో మనోజ్ పెళ్లి జరిగింది. మ‌నోజ్‌, మౌనిక పెళ్లికి ఇరువురి కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు కొద్ది మంది స‌న్నిహితులు అలానే సినీ ఇండస్ట్రీ సెలబ్రెటీస్ హాజ‌ర‌య్యారు. మంచు మోహ‌న్‌బాబు, విష్ణుతో పాటు ఇత‌ర కుటుంబ‌స‌భ్యులు కొత్త జంట‌ను ఆశీర్వ‌దించారు.

 

ఈ పెళ్లికి వైఎస్ విజ‌య‌మ్మ‌, మౌనిక‌రెడ్డి సోద‌రి అఖిల‌ప్రియ‌తో పాటు శాంత‌బ‌యోటెక్ అధినేత వ‌ర‌ప్ర‌సాద్‌రెడ్డి పెళ్లి వేడుక‌లో కనిపించారు. మ‌నోజ్‌, మౌనిక పెళ్లి ఫొటోలు అలానే వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సింగర్ సునీత ఆమె భర్తతో కలిసి రాగా, సిద్దు జొన్నలగడ్డ, తేజ సత్య, డైలాగ్ రైటర్ బివిఎస్ రవి, దర్శకుడు బాబి, వెన్నెల కిషోర్‌, ఇంకా అనేకమంది సెలబ్రెటీస్ సందడి చేశారు.

పెళ్లి బట్టల్లో మనోజ్, మౌనిక జంట మెరిసిపోయింది. బంగారు వర్ణం పట్టు కుర్తా, దోతిలో మనోజ్ కనిపించగా.. ఆకుపచ్చ, గులాబీ వర్ణం పట్టుచీరలో మౌనిక ఎంతో అందంగా ఉంది. గ‌త ఏడాది హైద‌రాబాద్‌లో వినాయ‌క‌చ‌వితి ఉత్స‌వాల్లో మౌనిక‌రెడ్డితో క‌లిసి పాల్గొన్నాడు మ‌నోజ్‌. ఈ పెళ్లికి భారీగానే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. రెండో పెళ్లి అయినప్పటికీ రెండు కుటుంబాలకు బాగా డబ్బు ఉంది. కావున గ్రాండ్ గా చేశారు.

 

మరోవైపు కట్నం కింద కూడా భూమా మౌనిక గట్టిగానే సమర్పించదని టాక్ నడుస్తోంది. తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఆస్తి భూమా మౌనికకు వేల కోట్లే ఉంది. ఈ క్రమంలోనే తన భర్తకు కూడా తాను కట్నం బాగా ఇవ్వాలని ఫిక్స్ అయి, కోట్ల రూపాయలు సమర్పించిదట. ఏకంగా 250 కోట్ల రూపాయలు మంచు మనోజ్, మౌనిక నుంచి తీసుకున్నారని తెలిసింది. ఇప్పుడు ఈ విషయమే సోషల్ మీడియాలో చర్చగా సాగుతోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -