First Day Collections: జిన్నా ఫస్ట్ డే కలెక్షన్.. ప్రిన్స్, సర్దార్, ఓరి దేవుడా ఫస్ట్ డే కలెక్షన్ వివరాలు

First Day Collections: దీపావళి కానుకగా టాలీవుడ్‌లో ఏకంగా నాలుగు సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. ఈ నాలుగు సినిమాల్లో మా అధ్యక్షుడు మంచు విష్ణు హీరోగా నటించిన సినిమా జిన్నా కూడా రిలీజ్ అయింది. అలాగే తమిళ స్టార్ కార్తీ హీరోగా నటించిన సినిమా ‘సర్దార్’. విశ్వక్ సేన్, విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్‌లో రిలీజ్ అయిన సినిమా ‘ఓరి దేవుడా’, అలాగే శివ కార్తీకేయన్ నటించిన సినిమా ‘ప్రిన్స్’ సినిమాలు విడుదలయ్యాయి. ఈ నాలుగు సినిమాలు తొలి రోజు ఎన్ని కలెక్షన్ సంపాదించాయనే ఈ క్రింది విధంగా తెలుసుకుందాం.

జిన్నా ఫస్ట్ డే కలెక్షన్స్..

మంచు విష్ణు హీరోగా నటించిన సినిమా ‘జిన్నా’. సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సన్నిలియోన్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో జిన్నా ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.12 లక్షలు మాత్రమే. ఓవర్‌సీస్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని సినీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు.

సర్దార్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్..

మిత్రన్ దర్శకత్వంలో హీరో కార్తీ నటించిన సినిమా ‘సర్దార్’. ఈ సినిమాలో తొలి రోజు కలెక్షన్.. నైజాం ఏరియాలో రూ.40 లక్షలు, సీడెడ్‌లో రూ.10 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.45 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా ఫస్ట్ డే కలెక్షన్ రూ.95 లక్షలు వచ్చాయి.

ప్రిన్స్ మూవీ కలెక్షన్స్..

జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తీకేయన్ హీరోగా నటించిన సినిమా ‘ప్రిన్స్’. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందింది. నైజాంలో రూ.35 లక్షలు, సీడెడ్, ఆంధ్రప్రదేశ్‌లో రూ.55 లక్షలు, మొత్తంగా రూ.90 లక్షలు వసూలు చేసింది.

ఓరి దేవుడా సినిమా కలెక్షన్..

మారిముత్తు దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్-విశ్వక్ సేన్ హీరోలు నటించిన సినిమా ‘ఓరి దేవుడా’. ఓ మై కడవులేకి అనే తమిళ సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమా నైజాంలో రూ.35 లక్షలు, సీడెడ్‌లో రూ.10 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.45 లక్షలు వసూలు చేసింది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -