CM KCR: కేసీఆర్ కొత్త పార్టీ పేరు ఏంటో తెలుసా? రైతుల పేరుతో కొత్త పార్టీ

CM KCR: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు జరుగుతున్నాయి. రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అర్థం కావడం లేదు. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం కూడా లేకపోవడంతో పార్టీలన్నీ ఎన్నికలకు సన్నద్దం అవుతున్నాయి. మధ్యలో మునుగోడు ఉపఎన్నిక రావడంతో తెలంగాణలో ఇప్పటినుంచే ఎన్నికల వేడి మొదలైంది. పార్టీలన్నీ సర్వేలు చేయించుకుంటూ ఎన్నికల అభ్యర్థులపై కసరత్తు మొదలుపెట్టాయి.

అధికార టీఆర్ఎస్ ప్రశాంత్ కిషోర్ ను వ్యూహకర్తగా నియమించుకోగా.. కాంగ్రెస్ పార్టీ సునీల్ కనుగోలును తమ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ఎంచుకుంది. దీంతో సర్వేలతో పార్టీ ఎక్కడ బలహీనంగా ఉందో తెలుసుకుని అక్కడ పార్టీని బలపర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి పార్టీలు. ఇక టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీ తమ వ్యూహలతో టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు రకరకాల ప్లాన్ లు వేస్తుంది. అయితే తెలంగాణతో పాటు దేశ రాజకీయాలపై కూడా సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు.

టీఆర్ఎస్ ను భారతీయ రాష్ట్ర సమితిగా మారుస్తారని, టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మారుస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే ఇటీవల ప్రగతిభవన్ లో రైతులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైతు సంఘాల నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. రైతులు రాజకీయాల్లోకి రావాలని సూచించారు. రాజకీయ ఉద్యమాలతో రైతుల ఉద్యమాలను కలపాలని సూచించారు. తెలంగాణ ఉద్యమం తరహాలో దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమం చేయాలని సూచించారు. తెలంగాణలో రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను అన్ని రాష్ట్రాల రైతులకు తెలపాలని, ఆయా రాష్ట్రాల్లో కూడా అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావాలన్నారు.

అయితే రైతులతో సమావేశం తర్వాత కొత్త అంశం తెరపైకి వచ్చింది. కేసీఆర్ పెట్టబోయే కొత్త జాతీయ పార్టీ పేరు భారతీయ రాష్ట్ర సమితి కాదని, భారత రైతు సమితిగా ఫిక్స్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. దేశంలో రైతులు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. అందుకే రైతు ఎజెండాగా దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా రైతులను ఏకం చేసి కేంద్రంపై పోరాటం చేయాలని కేసీఆర్ చూస్తున్నారు. రైతుల్లో కేంద్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. అందుకే తమ కొత్త జాతీయ పార్టీ తరపున రైతులను ఎన్నికల్లో నిలబెట్టాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలతో భేటీ వెనుక అసలు వ్యూహం ఇదేననే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న గుజరాత్ ఎన్నికలతో పాటు ఇతర రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రైతులను పోటీ చేయించాలని కేసీఆర్ ప్లాన్ రూపొందించారు. దానికి కావాల్సిర ఆర్ధిక సహయం కూడా అందజేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇతర పార్టీలతో కలవడం కంటే సొంత పార్టీ ఏర్పాటు చేయాలని కేసీఆర్ చూస్తున్నట్లు తెలుస్తోంది. కానీ వెనుక నుంచి ఇతర పార్టీలు మద్దతు ఇస్తాయని కేసీఆర్ భావిస్తున్నారట.

ఇవాళ బీహార్ పర్యటనకు సీఎం కేసీఆర్ వెళ్తున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ తో భేటీ కానున్నారు. దేశ రాజకీయాలతో పాటు మోదీని ఎదుర్కొనే అంశంపై చర్చించనున్నారు. ఈ సమావేశం తర్వాత కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

RTO Padmavati: ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అవుతున్న ఆర్డోవీ పద్మావతి.. వైసీపీ కోసం ఇంత చేస్తున్నారా?

RTO Padmavati:ఎన్టీఆర్ కృష్ణ జిల్లాలలో ప్రధాన పార్టీ అభ్యర్థుల నామినేషన్ పరిశీలన ప్రక్రియ తీవ్రస్థాయిలో ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొడాలి నాని నామినేషన్ విషయంలో తీవ్రస్థాయిలో...
- Advertisement -
- Advertisement -