KCR – Jagan: తెలంగాణలో కేసీఆర్ కే పట్టిన గతే ఏపీలో జగన్ కు పడుతుందా.. అధికారం దూరమైతే ఉంటారా?

KCR – Jagan: ప్రస్తుత తెలంగాణ రాజకీయాలను పరిశీస్తే.. మరో 2 నెలల తర్వాత ఏపీలో పరిస్థితితులు ఎలా ఉంటాయో అంచనా వేయోచ్చు. పదేళ్లుగా కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో ఏకచక్రాదిపత్యం వహించారు. అడ్డొచ్చిన వారిని తొక్కుకుకుంటూ పోయారు. అసలు రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేశారు. పేరుకే ప్రతిపక్ష పార్టీలు తప్పా.. ఆ పార్టీలకు ప్రతిపక్షహోదా లేకుండాపోయింది. 2014 నుంచి ఆయన జైత్రయాత్ర మొదలుపెట్టారు. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిపై నిఘాపెట్టి ఓటుకు నోటు కేసులో ఇరికించారు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలను అందరికి సంతలో పసువులను కొన్నట్టు కొన్నారు.

చివరికి 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మిగిలిన పార్టీలు అన్నీ కలిస్తే కానీ.. గెలవలేమనే పరిస్థితికి తీసుకొని వచ్చారు. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా కేసీఆర్‌కు వ్యతిరేకంగా టీడీపీ, కాంగ్రెస్ కూడా కలిసాయి. అయితే, ఆ ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలు ఘోరంగా ఓడిపోయాయి. కేవలం టీడీపీ రెండు స్థానాల్లో, కాంగ్రెస్ 20కి పైగా స్థానాల్లో గెలిచింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ లో మహామహులంతా ఓడిపోయారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి లాంటి వారికి అధికారులను అడ్డుగోలుగా ప్రయోగించి ఓడించారు. మొదటి సారి అధికారంలోకి వచ్చినపుడు టీడీపీని తెలంగాణలో ఖాళీ చేసిన కేసీఆర్.. రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ను కూడా ఖాళీ చేశారు. చివరికి కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను కోల్పోవడంతో ఎంఐఎం తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది. అంటే.. కేసీఆర్ ప్రతిపక్షం లేకుండా ఎంతలా అణచివేశారో అర్థం చేసుకోవచ్చు. అంతేనా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. రేవంత్ రెడ్డిని రెండు సార్లు జైల్లో పెట్టారు. అయితే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడమే పతనానికి నాంది.

ప్రతిపక్షం రూపం మారుతుంది కానీ.. ప్రతిపక్షం లేకుండా పోతుందనుకుంటే పొరపాటే. అదే విషయం తెలంగాణలో గత ఎన్నికల్లో రుజువు అయింది. కాంగ్రెస్ ఊహించని విధంగా అధికారంలోకి వచ్చింది. అప్పట్లో బీఆర్ఎస్ లో చేరినవారంతా ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇంత జరుగుతున్నా..బీఆర్ఎస్ అధిష్టానం గట్టిగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే.. గతంలో కేసీఆర్ ప్రోత్సహించిన ఫిరాయింపులో ఇప్పుడు ఆయన్ని మింగేసేలా ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ గూటికి చేరారు. ఎంపీ ఎన్నికలు తర్వాత ఆ పార్టీలో కేసీఆర్ ఫ్యామిలీ తప్ప మరెవరూ ఉండరని అంటున్నారు.

అయితే.. ఏపీలో కూడా మరో రెండు నెలల్లో ఇదే పరిస్థితి ఉండొచ్చు. సర్వేలన్నీ వైసీపీ ఓటమి ఖాయమని చెబుతున్నాయి. గత ఐదేళ్లులో వైసీపీ దాడులు మాములుగా లేవు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. అందరిపై కేసులే. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, రఘురామకృష్ణంరాజు ఇలా.. అందరూ జగన్ బాధితులే. జైలు జీవితం గడిపిన వారే. అయితే, రాజకీయ నాయకులే కాదు చాలా మంది సామాన్యులు కూడా జగన్ అరాచాకానికి గురైయ్యారు. సర్వేలు నిజమై వైసీపీ ఓటమి ఖాయం అయితే.. ఎన్నికలు జరిగిన 6 నెలల్లో ఆ పార్టీ ఖాళీ అవ్వడం ఖాయం.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -