Puri Jagannadh-Jr NTR: పూరీ, ఎన్టీఆర్ ను మోసం చేసిన మేనేజర్!

Puri Jagannadh-Jr NTR: ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ రెండు ప్రాజెక్టులతో షూటింగ్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే మేనేజర్ కృష్ణ గురించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మేనేజర్ కృష్ణ ఇదివరకు పూరి జగన్నాథ్ దగ్గర ఉండేవాడు.

అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో.. మరి ఎలాంటి మనస్పర్ధలు వచ్చాయో కానీ.. మొత్తానికి మేనేజర్ కృష్ణ అక్కడి నుంచి బయటికి వచ్చేసాడు. కానీ పూరి జగన్నాథ్ దగ్గర నుంచి కృష్ణ లెఫ్ట్ అవ్వడానికి కారణాలు మాత్రం ఇప్పటివరకు బయటపడలేదు. ఈ విషయం గురించి పూరి జగన్నాథ్ కూడా ఎప్పుడు స్పందించలేదు. ఇప్పుడా మేనేజర్ కృష్ణ ఎన్టీఆర్ దగ్గర చేరాడు.

కానీ ఇప్పుడే గుసగుసలు మొదలవుతున్నాయి.. ఎన్టీఆర్ కూడా ఇతని దూరం పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. కృష్ణకు ఎన్టీఆర్ దగ్గర కూడా లెక్కల విషయంలో తేడా వచ్చినట్లు తెలుస్తుంది. అందుకే ఎన్టీఆర్ కూడా కృష్ణ ని దూరం పెట్టినట్టు తెలుస్తుంది. మరి ఈ విషయంలో నిజం ఏంటో తెలియదు కానీ.. రామయ్య వస్తావయ్య కథను పూర్తిగా గమనించకుండా ఒప్పుకోవడం వల్ల.. ఇతని హస్తం కూడా ఉందని పుకార్లు వస్తున్నాయి.

ఇక ఎన్టీఆర్ రాబోయే సినిమాల విషయానికొస్తే.. ఎన్టీఆర్ 31 ఈ సినిమాకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదేవిధంగా ఎన్టీఆర్ 30 అనే ప్రాజెక్టును కొరటాల శివ ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నాడు. కాగా ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో ఎన్టీఆర్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమాలతో ఎన్టీఆర్ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ రెండు ప్రాజెక్టులు విషయంలో షూటింగ్ నేపథ్యంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ సినిమా కోసం డిసెంబర్ వరకు వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -