Rajinikanth: రజనీకి అమ్మ ప్రేమను పంచిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా?

Rajinikanth: దేశ విదేశాల్లో కోట్ల మంది అభిమాలున్న చూరొగొన్న నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఈయన కెరీర్ జర్నీ గురించి అందరికీ తెలిసిందే. సాధారణ ఆర్టీసీ కండెక్టర్ గా మొదలైన జీవితం నేడు వెండి తెరని ఏలే సూపర్ స్టార్ గా ఎదిగారు. ఎదిగే క్రమంలో ఎన్నో అవమానాలు అవరోధాలు ఎదుర్కున్నారు. రజనీ జీవితంలో రెండు పార్శ్వాలున్నాయి.

 

రజనీ సింప్లిసిటీ వెనుక మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. ఇక రజనీ సినిమాల్లోకి వచ్చే సమయానికి ఆయన తల్లిని కోల్పోయారు. తాజాగా బుధవారం మార్చి 8 ప్రపంచ మహిళ దినోత్సవం సందర్భంగా రజనీకి అమ్మ ప్రేమని పంచిన ఓ మహిళ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు. సినిమాల్లో బిజీగా గడిపే రోజులవి. ఓ బంగళాలో షూటింగ్ చేస్తుంటే, ఆ ఇంటి యజమాని రెజీనా పరిచయం అయ్యారు. ఆమె సంఘ సేవకురాలు. తల్లి లేని నాకు అమ్మ ప్రేమను పంచారు. 1979 లో వరుసగా 17 సినిమాలు చేసి తీవ్ర ఒత్తిడి వల్ల ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అప్పుడు రెజీనా అమ్మే కంటికి రెప్పలా చూసుకున్నారని చెప్పుకొచ్చారు రజనీకాంత్.

ఆమె ఇంటికి తీసుకెళ్లి సపర్యాలు చేసారు. నా గురించి ఎప్పటికప్పుడు వైద్యులకు చెబుతూ సరైన వైద్యం అదేలా చేసారు. నెల రోజుల పాటు ఆమెతో ఉండటం వల్ల నేను మళ్లీ మామూలు మనిషిగా మారాను. సహనంగా..ప్రేమగా ఉండటం ఆమె గొప్పదనం. అందుకే ఆమె నాకు ఎప్పటికీ రోల్ మోడల్’ అని తెలిపారు. ఇక రజనీ కాంత్ వృత్తి పరంగా ఎంత బిజీగా ఉన్నారు అన్నది చెప్పాల్సిన పనిలేదు. 72 ఏళ్ల వయసులోనూ పరుగులు పెట్టి మరీ సినిమాలు చేస్తున్నారు. కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. ఆన్ సెట్స్ లోనూ అలాగే శ్రమిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -