Vishal: హీరో విశాల్ పై ఇంత పగా.. ఇంటిపై రాళ్లతో దాడి చేసింది వాళ్లేనా?

Vishal: తెలుగు సినీప్రియులకు హీరో విశాల్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరో స్థాయిలో లో గుర్తింపు సంపాదించుకున్నాడు విశాల్. తమిళ ఇండస్ట్రీలో నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా చాలా సినిమాలు నిర్మించాడు. ఇక ఇదే క్రమంలో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించి విశాల్ హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.

ఇక చక్ర, ఎనిమీ సినిమాలో నటించినప్పటికీ విశాల్ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాడు. ఆ తర్వాత పందెంకోడి సినిమాతో విశాల్ హీరోగా తెలుగు ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకున్నాడు. కాగా పందెంకోడి 2 సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అలా విశాల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా 20కు పైగా సినిమాల్లో నటించి గతంలో తనకంటూ చరగని ముద్ర సంపాదించుకున్నాడు.

ఇక తమిళ ఇండస్ట్రీలో విశాల్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో విశాల్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇదంతా పక్కన పెడితే హీరో విశాల్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హడావిడి చేస్తుంది. అదేంటంటే.. విశాల్ ఇంటిపై రాళ్ల దాడి చేశారట. చెన్నై అన్నా నగర్ లో ఉన్న తన ఇంటిపై కొందరు దుండగులు రాళ్ల దాడి చేసినట్లు తెలుస్తుంది.

అంతేకాకుండా పలు వస్తువులను ధ్వంసం చేసినట్లు తెలుస్తుంది. దీంతో హీరో విశాల్ పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ చేశాడంట. కాగా పోలీసులు సిసి పుట్టేజ్ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. ఈ విషయం తెలిసిన కొందరు నెటిజన్లు ఆర్థిక లావాదేవులకు సంబంధించిన వివాదాలు వల్ల ఈ దాడి జరిగిందని అనుకుంటున్నారు. ఇక విశాల్ రాబోయే సినిమాల విషయానికి వస్తే మద గజ రాజా అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలుస్తుంది. డైరెక్టర్ సుందర్ సి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమా డిసెంబర్ 18న విడుదలవుతున్నట్లు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -