Balayya: గోదావరి జిల్లాలో బాలయ్య క్రియేట్ చేసిన రికార్డ్ ఏంటో తెలుసా?

Balayya: సినీ రంగంలో టెక్నాలజీ మారుతోంది. ఇప్పుడు సినిమా అనేది కొన్ని వందల సెంటర్లలో వేల థియేటర్లలో తొలిరోజే రిలీజ్ అవుతుంది. డిజిటల్ యుగం అవ్వ అది సాధ్యమైంది. అయితే ఆనాటి రోజుల్లో ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడంతా ఫిలిం యుగం అని అందరికీ తెలుసు. అప్పుడంతా సినిమాలు పెద్ద సెంటర్లలోనే తొలి రోజు విడుదల అయ్యేవి. అక్కడ 100 రోజులు 200 రోజులు ఆడిన తర్వాత బీ సెంటర్లకు అక్కడి నుంచి సి సెంటర్లకు వెళ్లేవి. ఆ తర్వాత టూరింగ్ టాకీస్ లకు ఫిలింను పంపేవారు. అంటే రిలీజ్ అయ్యే సినిమా పల్లెటూర్లకు వెళ్లాంటే కనీసం 10 నెలల వరకూ సమయం పట్టేది.

 

అదే ప్లాప్ సినిమా అయితే కాస్త ముందుగానే పల్లెటూర్లకు వెళ్లిపోయేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మారుమూల పల్లెటూర్లలో కూడా ఓకే రోజు సినిమాలు విడుదల అవుతున్నాయి. దీంతో ఒకేరోజు ప్రపంచవ్యాప్తంగా వందలాది థియేటర్లలో సినిమాలను ప్రేక్షకులు చూడొచ్చు. 20 ఏళ్ల క్రితం చిన్నచిన్న పల్లెటూర్లలో సినిమాలు విడుదలవ్వడం అంటే పెద్ద సంచలనంగా చెప్పుకునేవారు.

 

అప్పట్లో గోదావరి జిల్లాలో మారుమూల పల్లెటూరులో రిలీజ్ అయిన బాబాయి బాలకృష్ణ, అబ్బాయి ఎన్టీఆర్ సినిమాలు వంద రోజులు ఆడి రికార్డు నెలకొల్పాయి. అప్పట్లో అదొక సంచలనం అయ్యింది. ఆ రెండు పల్లెటూర్లలో ఇప్పటికీ బాబాయ్, అబ్బాయి సినిమాల‌ రికార్డులను ఏ టాలీవుడ్ హీరో కూడా బ్రేక్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. బాలకృష్ణ తీసిన నరసింహనాయుడు సినిమా పశ్చిమగోదావరి జిల్లాలోని మండల కేంద్రమైన కామవరపుకోట చరిత్రలో ఫస్ట్ రిలీజ్ గా నిలిచింది. 2001 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఆ సినిమా కామవరపుకోటలోని లక్ష్మీ థియేటర్లో 101 రోజులు ఆడి రికార్డు నెలకొల్పింది.

 

అప్పట్లో 11 లక్షలకు పైగా గ్రాస్ ను ఆ సినిమా వసూలు చేయడం విశేషం. ఆ తర్వాత 2003లో ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా అదే పశ్చిమగోదావరి జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి అన్నపూర్ణ థియేటర్లో రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించింది. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో అక్కడ ఏకంగా 100 రోజులకుపైగా ఆడి రికార్డులు తిరగరాసింది. సింహాద్రి సినిమాకు అనంతపల్లిలో 12 లక్షలకు పైగా గ్రాస్ వసూలు అయ్యింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -