Anil Ravipudi-Sreeleela: అనిల్ రావిపూడి శ్రీలీల మధ్య బంధుత్వం తెలుసా.. ఆ రీజన్ వల్లే మూవీ ఆఫర్ ఇచ్చాడా?

Anil Ravipudi-Sreeleela: టాలీవుడ్ లో యంగెస్ట్ హీరోయిన్ గా పేరు సంపాదించుకొని, విడుదలైన ప్రతి సినిమాలోని తనే హీరోయిన్ గా కొనసాగుతూ హిట్లు అందుకుంటున్న నటి శ్రీ లీల. ఈమె నార్త్ భామలకు ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతుంది. అయితే శ్రీ లీల, ఇద్దరు బంధువులు అవుతారంట,ఈ విషయాన్ని స్వయంగా అనిల్ రావిపూడి వెల్లడించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలకి హాజరవుతున్నారు ఆ సినిమా టీం.

అందులో భాగంగానే అనిల్ రావిపూడి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీలీలకు తనకి ఉన్న బంధుత్వం గురించి వివరించారు. శ్రీలీల అమ్మ డాక్టర్ స్వర్ణ సొంతూరు ఒంగోలు దగ్గర్లో ఉన్న పంగలూరు అని, తన అమ్మమ్మ ది కూడా అదే ఊరని ఆయన తెలిపారు. శ్రీలీల తల్లి తనకు వరుసకు అక్క అవుతుందని చెప్పారు. శ్రీలీల తెలుగు గడ్డపై పుట్టిందని అయితే బెంగళూరు, అమెరికాలో చదువుతుందని తెలిపారు.

ప్రతి సంవత్సరం పంగులూరు కి వస్తు ఉంటుందని చెప్పారు. షూటింగ్ సెట్లో ఎవరూ లేని సమయంలో మామయ్య అని పిలుస్తూ, అందరూ ఉన్నప్పుడు డైరెక్టర్ గారు అని పిలుస్తుందట శ్రీ లీల. అయితే ఈ విషయం భగవంత్ కేసరి సినిమా షూటింగ్ అయ్యేంతవరకు తెలియదట. షూటింగ్ టైంలో ఇద్దరు మాట్లాడుకుంటూ సొంత ఊళ్ళ గురించి టాపిక్ రావటంతో అసలు విషయం బయటపడింది.

శ్రీ లీల వాళ్ళ అమ్మ ఎప్పుడో అమెరికా వెళ్లిపోవడంతో కాంట్రాక్టు లేక ఇన్నాళ్లు తెలియలేదని ఇప్పుడు తెలిసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లు తెలిపాడు అనిల్ రావిపూడి.ఇక స్త్రీలీల కూడా ఈ విషయం తెలిసి మొదట ఆశ్చర్యపోయి తర్వాత హ్యాపీగా ఫీల్ అయిందట. భగవంత్ కేసరి సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఇందులో శ్రీ లీల బాలయ్యకు కూతురుగా విజ్జి పాప క్యారెక్టర్ లో నటిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -