Surya-Sai Pallavi: హీరో సూర్య సాయిపల్లవి మధ్య రిలేషన్ షిప్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?

Surya-Sai Pallavi: తమిళ హీరో సూర్య తెలుగు వారికి కూడా సుపరిచితమే. తమిళ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎదిగిన సూర్యకు.. తెలుగులోనూ ఫాలోయింగ్ విపరీతంగానే ఉంది. ముఖ్యంగా యముడు, సింగం లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు సూర్య. సూర్య తమిళంలో తీసే ప్రతి సినిమా దాదాపు తెలుగులో డబ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా చాలా ఆదరణ దక్కుతోంది. ఇక హీరోయిన్ సాయి పల్లవి గురించి కూడా తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. ఫిదా లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది సాయి పల్లవి.

సూర్య అంటే వీరాభిమానం: సాయి పల్లవి

అయితే, సాయి పల్లవికి హీరో సూర్య అంటే పడి చచ్చేంత ఇష్టమట. సాయిపల్లవి సూర్యకు చిన్నప్పటి నుంచి వీరాభిమాని కావడం గమనార్హం. సూర్య అంటే సాయిపల్లవి పడిచచ్చిపోతుందని బోగట్టా. సూర్యకు వీరాభిమాని అయిన సాయిపల్లవి సూర్యను గురువులా భావిస్తుంది. సూర్యపై ఉన్న అభిమానంతో ఎన్జీకే మూవీ కథ నచ్చకపోయినా సాయిపల్లవి నటించింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.

సాయి పల్లవి డ్యాన్స్ అంటే చాలా మంది ఇష్టపడతారు. హీరోయిన్ గా కూడా తన నటన అంటే చాలా మందికి ఇష్టం. టాప్ హీరోయిన్ల మాదిరి కాకుండా సింపుల్ గా ఉండటం సాయి పల్లవి ప్రత్యేకత. తన నటన, హావ భావాలతో ఇంప్రెస్ చేస్తుంది సాయి పల్లవి. తెలుగులో ఎంసీఏ, ఫిదా లాంటి సినిమాలు హిట్ గా నిలిచాయి. వెబ్ సిరీస్ లలోనూ నటించి మెప్పించింది.

ఇక సూర్య అంటే ఇష్టంతో ఎన్జీకే కథ నచ్చకపోయినా ఈ ప్రాజెక్టును ఒప్పుకుందట సాయి పల్లవి. దీనికి కారణం సూర్య మీద అభిమానమేనట. అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ ఎన్జీకే సినిమా ప్లాప్ అయ్యింది. ఈ నేపథ్యంలో తర్వాత ఓ మంచి హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సూర్యతో కలిసి మంచి కథ దొరికితే మళ్లీ నటించేలా సాయిపల్లవి ఆలోచిస్తోందట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -