Shivalingam: పెళ్లికానీ యువతులు శివలింగాన్ని పూజిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Shivalingam: దేశంలో హిందువులు ఎక్కువ శాతం మంది కొలిచే దేవుళ్ళలో పరమేశ్వరుడు కూడా ఒకరు. దేశవ్యాప్తంగా ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తూ లింగ రూపంలో ఉన్న పరమేశ్వరుని భక్తిశ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. భక్తులు చేసే పూజలను అందుకుంటూ భక్తులు కోరిన కోరిక నెరవేరుస్తున్నాడు బోళా శంకరుడు. ఇకపోతే హిందూ పురాణాల ప్రకారం పెళ్లి కాని యువతులు పరమేశ్వరుని పూజించవచ్చా? పూజించకూడదా? ఈ విషయం గురించి శాస్త్రాలు ఏమంటున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

హిందువులు పరమేశ్వరుని సోమవారం రోజు భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఆ రోజున మాంసాహారం తినకుండా కూరగాయల ఆహారం తీసుకుంటూ శివుడి చిత్రపటాలకు, విగ్రహాలకు పూజలు చేస్తూ ఉంటారు. మనకు ఎక్కడికి వెళ్లినా కూడా చాలా వరకు శివుడు లింగ రూపంలోనే మనకు దర్శనమిస్తాడు. శివాలయానికి వెళ్లిన అక్కడ శివుని విగ్రహం ఉండదు. కేవలం లింగం రూపం మాత్రమే ఉంటుంది. అయితే పెళ్లి కానీ యువతులు శివలింగాన్ని పూజించకూడదు అని మన పెద్దలు చెబుతున్నారు. శివలింగం అనగా కింద భాగం బ్రహ్మ, పై భాగం శివ, మధ్యభాగం విష్ణు రూపంగా భావిస్తారు.

 

లింగం కింద ఉండే భాగాన్ని యోని అని పిలుస్తారు. యోని లింగం సంగమమైన శివలింగం విశ్వాసానికి ప్రతీక అని భక్తులు కొలుస్తుంటారు. సమస్త విశ్వం ఇందులోనే ఉందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అనగా శివలింగంలో ఉండేటువంటి లింగం, యోని భాగాలు హ్యూనర్ రీ ప్రొడక్షన్ సిస్టమ్ అనగా ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన అవయవాలను సూచిస్తాయి. కాబట్టి హిందూ పురణాల ప్రకారం.. లింగం అనగా నాశనం లేనిది, స్థిరమైనది, దృఢమైనదని అర్థం. శక్తిని జనింపజేసే శక్తి లింగానికి ఉందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అనంతమైన శక్తి లింగం నుంచి ఉద్భవించబడుతుంది అని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అయితే, ఓం నమ:శివాయ అనే మంత్ర స్మరణ చేతనే లింగారాధన జరిగినట్లు భావించాలని పెద్దలు చెప్తున్నారు.

 

పెళ్లి కాని యువతులు శివలింగాన్ని కాకుండా పార్వతీ దేవితో కలిసి ఉన్నటువంటి శివున్ని పూజించాలి. అలా చేయడం వలన మంచి ప్రయోజనాలు ఉంటాయి. పార్వతీ దేవీ సమేతంగా ఉన్నటువంటి శివుడిని 16 రోజుల పాటు సోమవారాలు ఉపవాసం ఉండి పూజలు చేస్తే చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. శివుడు అలా ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన యువతులకు అత్యంత తక్కువ సమయంలోనే మంచి వరుడిని ప్రసాదిస్తాడు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -