Diabetes: షుగర్ ఉన్నవారు ఆల్కహాల్ సేవిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Diabetes: ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమందిలో ఆరు మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో డయాబెటిస్ కూడా ఒకటి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామంది ఈ డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్న విషయం తెలిసిందే. అందుకు గల కారణం ఆహారపు అలవాట్లే అని చెప్పవచ్చు. ఈ డయాబెటిస్ కారణంగా చాలామంది అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరి ముఖ్యంగా డయాబెటిస్ వచ్చిన తర్వాత ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అన్న కూడా ఆలోచిస్తూ ఉంటారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడానికి ఎన్నో రకాల ఫుడ్స్ ని తీసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కొన్ని కొన్ని సార్లు షుగర్ లెవెల్స్ ఎక్కువగా తక్కువగా అవుతూ ఉంటాయి.

అయితే చాలామంది పురుషులకు షుగర్ ఉన్నప్పటికీ ఆల్కహాల్ ని సేవిస్తూ ఉంటారు. మరి షుగర్ ఉన్నవారు ఆల్కహాల్ ని సేవిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

దీర్ఘకాలిక వ్యాధిగస్తులు మద్యపానం తాగితే తప్పులేదని, కానీ సరైన మోతాదులో తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మద్యం తరుచూ అధికంగా సేవిస్తే మధుమేహం రావడానికి ఆస్కారం ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా మధుమేహం మద్యం వల్లే వస్తుందని కేవలం అపోహ మాత్రమే అని, వారసత్వం, జీన్స్ పరంగా కూడా ఒక కుటుంబంలోని వారసులకు మధుమేహం వచ్చే అవకాశం ఉంటుందట. కాబట్టి షుగర్ ఉన్న వారు ఒకవేళ షుగర్ లేని వారు కూడా మద్యం ని మోతాదులో తీసుకోవాలి.

 

మద్యపానం లిమిట్‌లో తీసుకుంటే పెద్దగా సమస్యలు రావు. రోజుల్లో కేవలం పురుషుల మాత్రమే కాకుండా స్త్రీలు కూడా ఈ ఆల్కహాల్, స్మోకింగ్ కి అలవాటు పడ్డారు. సిటీలలో అయితే ఇదే కల్చర్ ని చాలామంది ఫాలో అవుతున్నారు. మహిళలు రోజుకు 30ఎంఎల్ విస్కీ, పురుషులు 60ఎంఎల్ విస్కీని తీసుకోవచ్చు. ఈ మోతాదును మించితే కచ్చితంగా మధుమేహం వస్తుంది. దీనికి తోడు ఉబకాయం భారీన కూడా పడుతారు..అతిగా మద్యం సేవిస్తే చాలా ప్రమాదకరం. గుండె, కాలేయం మొదలైనవి తీవ్రంగా ప్రభావితమవుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు మద్యం సేవించినప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. బదులుగా ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇది దీర్ఘకాలికంగా అంతర్గత భాగాలకు నష్టం కలిగిస్తూ వస్తుంది. మద్యం తాగడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు భోజనం తర్వాత లేదా ముందు మారుతుంటాయి. ఫుడ్ తీసుకోకపోతే కాలేయం నిల్వ చేసిన గ్లూకోజ్‌ను విడుదల చేస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -