Tollywood Heroines Favorite Food : ఈ టాలీవుడ్ ముద్దుగుమ్మలకు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా?

Tollywood Heroines Favorite Food : సినీ ఇండస్ట్రీలో సినీ తారలకు నటనతో పాటు అందం కూడా చాలా ముఖ్యమైనది. గ్లామర్ గా కనపడేందుకు తెగ ప్రయత్నాలు చేసేస్తుంటారు. ఇక ఆహార విషయంలో కూడా అసలు రాజీపడరు. మరి మన ఇష్టమైన హీరోయిన్స్ కు ఇష్టమైన వంటలు ఏంటో చూసేద్దాం.

సమంత: ఈ బ్యూటీకు పాలకోవా, డైరీ మిల్క్ చాక్లెట్, స్వీట్ పొంగల్, సుషి అంటే చాలా ఇష్టమట.

కాజల్ అగర్వాల్: ఇక ఈమెకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టమట. హైదరాబాదులో షూటింగ్ ఉంటే కంపల్సరిగా హైదరాబాద్ బిర్యానీ ఉండాల్సిందేనట.

తమన్నా: ఈ హీరోయిన్ కు కూడా హైదరాబాద్ బిర్యానీ అంటే తెగ ఇష్టమట. హైదరాబాద్ వస్తే బిర్యాని రుచి చూడకుండా ఉండలేదట.

అనుష్క: ఈ హీరోయిన్ కు చికెన్ డిషెస్ అంటే చాలా ఇష్టమట. దగ్గరుండి చికెన్ డిషెస్ లలో వెరైటీలు చేసుకుని రుచి చూడడం ఈమె అలవాటు.

రష్మిక మందన్న: ఈమెకు బెంగళూరులో దొరికే దోశ అంటే చాలా ఇష్టమట. ఈమెకు నచ్చిన దోశ బెంగళూరులో కొన్నిచోట్ల మాత్రమే దొరుకుతుందట.

రకుల్ ప్రీత్ సింగ్: ఇక ఈమెకు ఆలూ పరోటా, గులాబ్జామ్ అంటే చాలా ఇష్టం. ఇవి కనిపిస్తే టేస్ట్ చేయకుండా ఉండలేదు.

రాశి కన్నా: ఈ బ్యూటీ కి లెబనీస్, చైనీస్ డిషేస్ అంటే చాలా ఇష్టమట. స్పెషల్ గా చేయించుకుని ఇష్టంగా తింటుందట.

నిత్యామీనన్: ఈమెకు సౌత్ ఇండియన్ వంటలంటే ఇష్టమట. అన్ని రకాల వంటలను ఇష్టంగా తింటుంది.

కీర్తి సురేష్: ఇక మన మహానటి సావిత్రికి దోశ అంటే చాలా ఇష్టమట. ఎక్కువగా బయట దోశ తినేందుకు ఇష్టపడుతుందట.

పూజా హెగ్డే: ఇక ఈమెకు బిర్యానీ, పిజ్జా అంటే ఎంతో ఇష్టమట. ఇక హైదరాబాద్ బిర్యానీ చూస్తే తినకుండా ఆపడం చాలా కష్టమట.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -