AP farmers: ఏపీ రైతులకు జగన్ చెప్పిన తీపికబురు ఏంటో తెలుసా?

AP farmers: సంక్షేమ పథకాలను అందించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారని.ప్రతి కుటుంబంలో ఎంతమంది అర్హులు ఉంటే వారందరికీ వివిధ సంక్షేమ పథకాలను అందిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే సంక్షేమ పథకాల పేరిట రైతులకు కూడా ఈయన రైతు భరోసా పేరిట ప్రతి ఏడాది డబ్బులు రైతుల ఖాతాలలో జమ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా ఇప్పటికే రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులను జమ చేసిన జగన్మోహన్ రెడ్డి మరోసారి రైతులకు శుభవార్తను తెలియజేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ద్వారా అందించే పెట్టుబడి నిధులు విడుదల చేయనున్నారు. ఈ ఏడాదికి సంబంధించి రైతులకు మొదటి విడత డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయడానికి సర్కార్ సిద్ధమైనదని తెలుస్తుంది.

 

ఇలా రైతు భరోసా నిధులను విడుదల చేయడమే కాకుండా అలాగే ఇటీవలి అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ చేయనున్నారు. ఈ నెల 30న కర్నూలు జిల్లా పత్తికొండలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ బటన్‌ నొక్కి రైతుల అకౌంట్‌లలో డబ్బు జమ చేయబోతున్నారు. ఏడాది తొలి విడత పెట్టుబడి సాయంగా రూ.7,500 చొప్పున మొత్త 52.31 లక్షల మంది రైతుల ఖాతాలో రూ.3,934.25 జమ చేయనున్నారు.

 

ప్రతి ఏడాది రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులను మూడు విడుదలగా జమ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. మే నెలలో ఒకసారి 7500 విడుదల చేయగా అక్టోబర్లో 4000మూడో విడతగా జనవరిలో 2000 రూపాయలను నేరుగా రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోని ఈ ఏడాది మొదట విడతలో భాగంగా మే 30వ తేదీ రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -