Volunteers: వాలంటీర్లపైనే భారం మోపుతున్న జగన్.. ఏం జరిగిందంటే?

Volunteers: ఏపీలో వాలంటీర్ వ్యవస్థ.. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. దేశంలో ఇలాంటి వ్యవస్థే లేదు. ఇలాంటి వ్యవస్థను తయారు చేయొచ్చనే ఆలోచన కూడా బహుశా ఎవరికీ రాదేమో. ఎందుకంటే.. అది ప్రభుత్వం వ్యవస్థ కాదు. కానీ, ప్రభుత్వమే వారికి జీతాలిస్తుంది. ప్రతీ నెల వందల కోట్ల రూపాయలను ఈ వ్యవస్థ కోసం ఖర్చు చేస్తున్నారు. దీని గురించి ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే.. జగన్ మరోసారి సీఎం అవ్వడానికి బలంగా నమ్ముకున్న వ్యవస్థ ఇది. అవును, కార్యకర్తలను, ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా జగన్ నమ్మడం లేదు. కేవలం వాలంటీర్లనే నమ్ముతున్నారు. ఈ వ్యవస్థను తీసుకొని వచ్చినపుడే జగన్ చెప్పారు. మీ అందరినీ భవిష్యత్ నాయకులుగా తయారుచేస్తానని.. అంటే.. భవిష్యత్ వైసీపీ నాయకులకు ఏపీ ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్మును జీతాలుగా ఇస్తున్నారు. ఇంత విచిత్రమైన దోరణి దేశంలో మరెక్కడా ఉండదు. మనందరి డబ్బును వారికి జీతాలుగా ఇస్తున్నారు కనుక మనకి కాస్త కష్టం ఉండొచ్చు కానీ.. వాలంటీర్లు కూడా ఆ ఉద్యోగాలతో సంతృప్తిగా లేరు. ఎందుకంటే జగన్ వారిని వాడుకుంటున్నారని వారికి అర్థమైంది. ఐదువేల రూపాయలు ఇచ్చి నెలంతా పని చేయాలని ఆదేశిస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది? పైగా చేస్తున్నది న్యాయమైన పని కాదు.. ప్రజలకు సేవ పేరుతో వారి నుంచి వ్యక్తిగత సమాచారం సేకరించడం. ఆ సమాచారంతో భవిష్యత్ లో జరిగే ఏ ఎన్నికల్లోనైనా ఓటు వేయాలని డిమాండ్ చేయడం. లేదంటే బెదిరింపులకు పాల్పడటం. దీని కోసమే వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చారు జగన్.

 

ఎన్నికల దగ్గర పడ్డాయి కనుక వాలంటీర్లకు ప్రోత్సాకహాల పేరుతో ఏవో కార్యక్రామాలు చేపడుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు వాలంటీర్లకు గిఫ్టులు పంపిణీ చేస్తున్నారు. ఎందుకంటే.. పార్టీలో కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు ఎంతవరకు పని చేస్తారో జగన్ కు నమ్మకం లేదు. దానికి కూడా కారణం లేకపోలేదు. గ్రామాల్లో ఏ పని కావాలన్నా.. వాలంటీర్ ఉంటే చాలు. పంచాయితీ సర్పంచ్, ఎంపీటీసీలతో పని లేదు. అంటే, వారి పదవులు అలంకారప్రాయంగా మారాయి. పవర్స్ అన్నీ వాలంటీర్ల దగ్గరే ఉన్నాయి. కాబట్టి.. రేపటి ఎన్నికల్లో పార్టీ నేతలు పని చేస్తారని నమ్మకం జగన్ కు లేదు. ఆశలన్నీ వాలంటీర్ల మీదనే పెట్టుకున్నారు. అందుకు గిఫ్టులు, ప్రోత్సహకాల పేరుతో ఎమ్మెల్యే అభ్యర్థులతో వాలంటీర్లకు తాయిలాలు అందిస్తున్నారు.

అయితే, ఈ తాయిలాలకు వాలంటీర్లు పడిపోతారా అంటే.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. వాలంటీర్లు వాస్తవాన్ని గ్రహించారు. 5వేలు తీసుకొని వైసీపీకి ఊడిగం చేస్తున్నామని అర్థం చేసుకున్నారు. జగన్ సీఎం అయ్యేనాటికి డిగ్రీ కంప్లీట్ చేసిన ఇద్దరు కుర్రాళ్లులో ఒకరు వాలంటీర్‌గా సెటిల్ అయితే.. మరొకరు కోచింగ్ తీసుకొన సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్లాడు. వాలంటీర్ జీతంలో మార్పులేదు. సాఫ్ట్‌వేర్ జీవితం అమాతంగా మారిపోయింది. ఇది ప్రతీ గ్రామంలో జరిగిన వాస్తవం. సొంత అవసరాల కోసం డిగ్రీలు చేసినవారిని కూడా వాలంటీర్లను నియమించారు. జగనన్న తమ జీవితాల్లో మార్పు తీసుకొస్తారని యువత కూడా అప్పట్లో ఈ వాలంటీర్ ఉద్యోగాల కోసం ఎగబడ్డారు. కానీ.. ఐదేళ్లు తిరిగే సరికి వాస్తవం తెలిసింది. సాఫ్ట్‌వేర్ స్నేహితుడి ఒకరోజు జీతం.. తన నెల జీతానికి సమానమనే వాస్తవాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు. అయితే.. ఇంతలోనే జీవితంలో కీలకమైన వయస్సును వృధా చేసుకున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న వాలంటీర్లు ఎన్నికల్లో ఎంతవరకు జగన్ కు అండగా ఉంటారో అనుమానమే. ఇప్పటికే కొంతమంది ఈ ఉద్యోగాలు వదిలి వెళ్లిపోయారు. మరికొంత మంది తమకు అనుకూలంగా ఉండటం లేదని వైసీపీ నేతలే తొలగిస్తున్నారు. దీంతో, ఎంతో నమ్మకంగా పెట్టుకున్న ఈ వ్యవస్థ ప్రజలకు, ఆ వాలంటీర్లకే కాదు.. జగన్ కు కూడా ఉపయోగపడేలా లేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -