Anjali: సినిమా అవకాశాల కోసం అంజలి చేసిన తప్పులు ఏంటో తెలుసా?

Anjali: అంజలి ఒక భారతీయ నటి. ఈమె మోడల్ గా కెరీర్ ప్రారంభించి తెలుగు, తమిళ భాషల్లో నటించింది. 2006లో ఫోటో సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత వరుస అవకాశాలతో తమిళ, తెలుగు భాషలలో రాణిస్తూ మంచి గుర్తింపు పొందింది. ఈమె తెలుగులో నటించిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, బలుపు, వకీల్ సాబ్ సినిమాలు చెప్పుకోదగినవి.

అయితే తమిళంలో వచ్చిన విధంగా తెలుగులో అవకాశాలు అనుకున్న రీతిలో రాలేదు. జనరల్ గా అయితే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలను హీరోయిన్ గా తీసుకోవడం చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటో తెలీదు గానీ మన తెలుగు దర్శకనిర్మాతలు తెలుగు వారి కంటే పక్కవారికే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు.

మన తెలుగు వాళ్లలో కూడా చాలా టాలెంట్ ఉంది అని ఎందుకు గుర్తించలేకపోతున్నారని చాలామంది హీరోయిన్స్ మండిపడ్డ సందర్భాలు ఉన్నాయి. తెలుగులో తన టాలెంట్ ను గుర్తించకపోవడంతో తమిళ ఇండస్ట్రీలో గుర్తింపు పొంది అక్కడ వచ్చిన పాపులాటరితో తెలుగులో అవకాశాలు సంపాదించింది మన తెలుగు అమ్మాయి అంజలి.

అయితే ఇటీవల కాలంలో అంజలి మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ నటించడం జరిగింది. అంతేకాదు ఇంతకుముందు అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాలో కూడా ఒక ఐటమ్ సాంగ్ లో నటించింది. అయినా కూడా తెలుగులో ఆమె నటనకు గుర్తించదగ్గ అవకాశాలు మాత్రం రాలేదు. అయితే కొందరు ఆమె అందం ఐటమ్ గర్ల్ కి సంబంధించింది కాదని… ట్రెడిషనల్ బ్యూటీ అని ఫ్యాన్స్ చెప్పడం జరిగింది.

కొందరైతే అంజలి అసలు ఐటం సాంగ్స్ చేయకపోయుంటే బాగుండేది అని పలుమార్లు పేర్కొనడం జరిగింది. కానీ అంజలి వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటేనే ఇండస్ట్రీలో రాణించగలుగుతాం అనుకొని చేసిన పొరపాటే ఆమె డౌన్ ఫాల్ కు కారణం. అంజలి ఐటెం సాంగ్ లో నటిస్తుందని ఎవరు ఊహించలేదు.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చాలామంది నెటిజన్స్ కామెంట్స్ చేయడం ద్వారా వైరల్ గా మారి హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక అంజలి ఒక తెలుగు, ఒక తమిళ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -