RC15: ఆంధ్రావాలాను తలపిస్తున్న రామ్ చరణ్ మూవీ లీకైన ఫోటోలు.. ఏమైందంటే?

RC15: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రాలను కూడా నిర్మిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈయన రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా RC 15 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ పనులు జరుపుతుండగా ఒక్కసారిగా భారతీయుడు 2సినిమా ఈ సినిమా షూటింగ్ పనులకు బ్రేకులు వేసింది.శంకర్ ఆ సినిమాకు కూడా దర్శకుడుగా వ్యవహరించడంతో కొన్ని రోజులు ఆ సినిమాకు మరికొన్ని రోజులు రాంచరణ్ సినిమాకు పనిచేస్తున్నారు తద్వారా ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతుంది.

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇలా ప్రతిసారి సినిమా నుంచి రామ్ చరణ్ లుక్ కి సంబంధించిన ఫోటోలు లీక్ అవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తాజాగా రామ్ చరణ్ అంజలి కలిసి ఉన్నటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇలాంటి లీకులను కట్టడి చేయడంలో దిల్ రాజు పూర్తిగా విఫలమయ్యారని ఇలాగే కొనసాగితే సినిమా పై ఉన్న అంచనాలు తగ్గిపోతాయని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఈ సినిమాలో రామ్ చరణ్ ఫోటోలు విడుదల కావడంతో ఇందులో ఈయన ద్విపాత్రాభినయంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తండ్రి పాత్రలో కూడా రామ్ చరణ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్నిసార్లు ఇలా వయస్సుకు మించిన పాత్రలలో కనిపించడం కొన్ని సందర్భాలలో ప్లస్ అయితే మరికొన్ని సందర్భాలలో మైనస్ అవుతుంది. ఇదివరకే జూనియర్ ఎన్టీఆర్ తండ్రి కొడుకుల పాత్రలో ఆంధ్ర వాలా సినిమాలో నటించారు. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.ఈ క్రమంలోనే రామ్ చరణ్ సినిమా నుంచి లీకైన ఫోటోలు అచ్చం ఇదే సినిమాని తలపిస్తున్నాయంటూ అభిమానులు ఈ సినిమా విషయంలో కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -