Balayya-NTR: బాలయ్య తొక్కేయకుండా తారక్ చేసిన పని ఏంటో తెలుసా?

Balayya-NTR: సినీ ఇండస్ట్రీలో ఏ మూలన చూసిన ఇప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ పేరే వినిపిస్తుంది. ఆర్‌ఆర్‌ఆర్‌లో అద్భుతమైన నటనతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. తన రేంజ్‌ను అమాంతం పెంచేసుకున్నాడు. ఇక బాబాయ్‌ బాలయ్యకు కూడా ఎన్టీఆర్‌ అంటే ఎంతో ప్రేమ. బయటకి అది కనిపించకోపోయినా ఎంతో బాధ్యతగా చూసుకుంటారని అతి కొందమందికి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఈ బాబాయ్‌-అబ్బాయ్‌ గురించి ఓ విషయంలో తెలిసింది.

 

నందమూరి హీరోల్లో గొప్ప నటుడు జూనియర్‌ ఎన్టీఆర్. ఏ నందమూరి హీరోకు దక్కనంత క్రేజ్‌ను సంపాదించుకున్నాడు ఈ యంగ్ టైగర్‌. హరికృష్ణ కొడుకుగా చాలా చిన్న వయసులో సినీ ఇండస్ట్రీలోకి వచ్చాడు ఎన్టీఆర్. అగ్ర హీరోగా ఎదిగిపోయాడు. అయితే కెరీర్‌ స్టార్టింగ్‌లో నందమూరి హీరోగా ఆయన్ను బాలకృష్ణ యాక్సెప్ట్ చేయలేదనే విమర్శలు ఎన్నో వచ్చాయి. అందుకే చాలా సార్లు స్టేజి మీదనే ఎన్టీఆర్‌ను ఇన్‌ డైరెక్టుగా అప్పట్లో బాలయ్య కామెంట్లు చేసేవాడని టాక్‌ ఉంది. నందమూరి ఫ్యామిలీలో హీరోలం ముగ్గురమే అని, ఒకటి మా నాన్న, తర్వాత అన్న హరికృష్ణ, ఇప్పుడు నేను అంటూ చెప్పుకునే వాడు బాలయ్య.

ఈ క్రమంలోనే నందమూరి అభిమానుల సపోర్టు తనకు దక్కకుండా చేస్తున్నాడని జూనియర్‌ గ్రహించాడట. అందుకే చాలా ఇంటర్వ్యూలలో ఆయన తనకు బాబాయ్‌ బాలకృష్ణ అంటే చాలా ఇష్టం అని కలుపుకు పోయే ప్రయత్నం చేశాడు. అంటే తామంతా ఒకటే అని, తాను నందమూరి బిడ్డనే అని తనను తాను ప్రమోట్ చేసుకున్నాడు ఎన్టీఆర్. అందుకే ఆయన వయసుకు మించిన మెచ్యూరిటీతో ఉండేవాడు అని అప్పట్లోనే అంతా పొగిడేవారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -