Health Tips: పంటినొప్పి అతిగా ఉంటే ఏం చేయాలో తెలుసా?

Health Tips: ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు చాలామంది పంటి నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. పంటి నొప్పి సమస్య అన్నది వర్ణనాతీతం. ఈ పంటినొప్పి కారణంగా తలనొప్పి కూడా వస్తుంటుంది. అయితే ఈ పంటి నొప్పి సమస్యకు ప్రధాన కారణం ఆహారపు అలవాట్లే అని చెప్పవచ్చు. మనం తీసుకునే ఆహారం వల్ల నోట్లో పళ్ళ మధ్య ఆహారం ఇరుక్కోవడం తో పాటు అవి పుచ్చిపోవడం దాంతో రావడం పంటి నొప్పి రావడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి నోట్లో క్రిములు అధికంగా పెరిగిపోవడం, సరిగా బ్రష్ చేయకపోవడమే కారణంగా కూడా చెప్పవచ్చు.

పంటినొప్పి సమస్య నుంచి బయట పడాలంటే ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం గోరువెచ్చని నీటిలో ఉప్పుని కలిపి పుక్కిలించాలి. ఇది మీ దంతాల మధ్య చిక్కుకున్న ఆహారాన్ని బయటకు వచ్చేలా చేస్తుంది. ఇలా చేయడం వలన పంటి నొప్పి, వేడి చేయడం, దంతాల సమస్యలు, చిగుళ్ల సమస్యల నుంచి సత్వరమే ఉపశమనం లభిస్తుంది. అలాగే వెల్లుల్లి దంతాల నొప్పికి కూడా నివారిణిగా పని చేస్తుంది. వెల్లుల్లిని గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకుని నొప్పి ఉన్న చోట పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది. లవంగాలను పంటి నొప్పికి వాడుతారు అని మనకు తెలిసిన విషయమే. ఈ రెమెడీ ని పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు.

 

లవంగం నూనె కూడా పంటి నొప్పిని తగ్గించడంలో బాగా ఉపయోగ పడుతుంది. పెప్పర్ మింట్ టీ బ్యాగ్ నొప్పిని తగ్గించడంలో సహాయ పడుతుంది. నొప్పి ఉన్న ప్రాంతంలో ఈ పెప్పర్ మింట్ టీ బ్యాగ్ పెట్టుకుని కొద్దిసేపు ఉంచితే నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే వేపాకు నమ్మడం వల్ల కూడా పంటి నొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -